అమెరికాలో స్థిరపడాలి అనుకునే ప్రతీ ఒక్కరికీ గొప్ప అవకాశం దొరికింది అనే చెప్పాలి హెచ్ -1బీ వీసాని పొందటానికి ఎంతో కష్టపడుతున్న సమయంలో అత్యంత సులువుగా అమెరికాలో స్థిరపదిపోయే మార్గం ఈబీ -5 వీసా...అయితే ఇప్పుడు ఈ వీసా గడువుని పెంచుతూ అమెరకా నిర్ణయం తీసుకుంది..డిసెంబర్ 22 వరకూ పొడిగించింది..అందుకే ఈ వీసాని  నేపథ్యంలో ప్రస్తుతం భారతీయులు సహా అనేక దేశాల  ప్రజలు...దరఖాస్తు చేసుకుంటున్నారు.

Related image

ఈ గోల్డెన్ వీసాని 1990లో అమెరికా కాంగ్రెస్‌ అమలులోకి తెచ్చింది..అమెరికాలో స్థానికులకు ఉపాధి కల్పించేందుకు కొన్ని చోట్ల టీఈఏ–టార్గెటెడ్‌ ఎంప్లాయ్‌మెంట్‌ ఏరియాస్‌ను ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతాల్లో 5 లక్షల డాలర్ల పెట్టుబడి లేదా టీఈఏ కిందకు రాని ప్రాంతాల్లో 10 లక్షల డాలర్ల పెట్టుబడి పెట్టి కంపెనీలను స్థాపించి కనీసం పది మందికి ఉపాధి కల్పించగలిగిన విదేశీయులకు ఈ వీసాలు మంజూరుచేస్తారు.

Image result for eb 5 visa

అయితే ఈ వీసాలు పొందిన వారికి ముందుగా గ్రీన్ కార్డు ఇచ్చి ఆ తరువాత అమెరికా పౌరసత్వం కూడా ఇస్తారు..ఈ కేటగిరీలో ఎక్కువ మంది భారతీయులు సుమారు 74% మంది అభ్యర్థులు నిర్మాణ రంగంలో పెట్టుబడులు పెడుతున్నట్లు సమాచారం...మరికొందరు ఆతిథ్య రంగంపై ఆసక్తిగా ఉన్నారు. అమెరికా వర్సిటీల్లో చదువుతున్న భారతీయ విద్యార్థులు కూడా భారీ సంఖ్యలోనే ఈబీ–5 వీసా కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు..మొత్తానికి హెచ్ -1బీ ద్వారా అవకాశం రాని వాళ్ళు ఈ గోల్డెన్ వీసాని ఉపయోగించుకోవాలి అను చెప్తున్నారు..

 


మరింత సమాచారం తెలుసుకోండి: