ఏఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తన వ్యవహార తీరుతో మరోసారి చర్చనీయాంశంగా మారారు. లోక్సభలో ధరల పెరుగుదలపై చర్చ జరుగుతున్న సమయంలో రాహుల్ గాంధీ గాఢ నిద్రలోకి జారిపోయారు. ధరల పెరుగుదలపై చర్చ పట్టించుకోకుండా రాహుల్ మాంచి నిద్రలోకి జారుకున్నారు. కాంగ్రెస్‌ ఎంపీలు రాహుల్ ను నిద్ర నుంచి మేల్కొలిపే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. లోక్సభలో ముందుగా ధరల పెరుగుదలపై చర్చ చేపట్టాలని రాహుల్ స్పీకర్ పోడియం వద్దకు దూసుకెళ్లి నిరసన వ్యక్తం చేశారు. నినాదాలు చేశారు. స్పీకర్ తో వాగ్వాదానికి దిగారు. చివరికి రాహుల్ కోరినట్టే ప్రభుత్వం చర్చకు సమ్మతించింది. చర్చ జోరుగా సాగుతుండగా ఆయన మాంచి నిద్రలోకి జారుకున్నారు. దీంతో బీజేపీ నేతలకు రివర్స్ లో ఛాన్స్ దొరికింది. ఇంకేముందు కాంగ్రెస్ యువనేతపై విమర్శనాస్త్రాలు సంధించడం మొదలు పెట్టారు. లోక్సభలో కీలకమైన ధరల పెరుగుదలపై చర్చ జరుగుతున్న సమయంలో నిద్రలోకి ఎలా జారుకుంటారని ప్రశ్నించారు. గత పదేళ్ళు పడుకున్న కాంగ్రెస్ నేతకు ఇంకా నిద్ర సరిపోలేదా? అంటూ సెటైర్లు వేశారు. ఇటు మీడియాలోనూ రాహుల్ నిద్రపోతున్న దృశ్యాలు హాట్ టాపిక్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: