జైట్లీ సరికొత్త బడ్జెట్‌పై పేదల సంగతి ఎలా ఉన్నా, వ్యాపార, వాణిజ్య, వేతనజీవులు ఇప్పుడు గంపెడా శలు పెట్టుకున్నారు. గురువారం జైట్లీ తమ బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనున్నారు. వేతనజీవులకు పన్నుల రాయితీలు, గతంలో విధించిన కొన్ని వివాదాస్పద పన్నుల విధింపుల ఎత్తివేత వంటివి జరగుతాయని వ్యాపార వర్గాలు ఆశిస్తు న్నాయి. అయితే ఆదాయ పన్ను పరిమితి పెంపుదల,ఇతర పన్నుల స్లాబ్‌ల వంటి సూచనలు వెలువడలేదు. కానీ పొదుపు ఖాతా లను పెంచేరీతిలో వడ్డీరేట్లకు ప్రోత్సాహకాలు ఉంటాయని భావిస్తున్నారు. పెట్టుబడులను పెంచే పేరుతో పరిశ్రమలకు రాయితీలను కల్పించే యోచనలో ఉన్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే ప్రభుత్వం ఆటోమోబైల్‌, వినియోగదారుల సంబంధిత రంగాలకు డిసెంబర్‌ వరకూ ఎక్సైజ్‌ సుంకం మినహాయింపులు ఇచ్చింది. ఇక బంగారం దిగుమతి సుంకా లను తగ్గించాలని కూడా ఆర్థిక మంత్రి యోచిస్తున్నారు. సిఏడీల నియంత్రణకు గత ప్రభుత్వం వీటిని పెంచింది. ఇక రైతుల కోసం ధరల స్థిరీకరణ నిధిని తమ బిజెపి వాగ్దానాలకు అనుగుణంగా ప్రకటించే వీలుంది. సరుకులు, సేవల పన్నులను ఉపసంహరించుకుని, దానికి బదులుగా ప్రత్యక్ష పన్నుల నిబంధనను వినియోగించు కోవాలనే ఆలోచనలో ఉన్నారు. ఇక కార్పొరేట్ల విలీనం, సేకరణల విషయంలో నిబంధనలను సరళీకృతం చేసే దిశలో మోడీ ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. ఈ ప్రక్రి యలో భాగంగా కార్పొరేట్లపై పన్నుల భారం తగ్గింపునకు జైట్లీ తమ బడ్జెట్‌లో కొన్ని ప్రతిపాదనలు చేసినట్లు తెలిసింది. దేశంలో మలివిడత ఆర్థిక సంస్కరణలకు కూడా సర్వేలో సూచనలు చేశారు. పోటీ ప్రపంచంలో మనగలిగేందుకు, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నిలిచేందుకు సంస్కరణల ప్రక్రియ అనివార్య మని కూడా మోడీ ప్రభుత్వం భావిస్తోంది.  సంక్లిష్ట పన్నుల విధానాన్ని మార్చివేసి, సరళీకృతం చేయా లని, సర్‌చార్జీల వంటి తోడు పన్నుల భారం తగ్గించాలని, సెస్సులు, డివిడెండ్‌ పంపిణీ లెవీలను పూర్తిగా ఎత్తివేయాలని సూచించారు. సామాన్యుడికి మేలు అనే నినాదంతో అధికారంలోకి వచ్చిన మోడీ ప్రభుత్వం ఇప్పుడు పన్నులు, పారిశ్రామిక ప్రోత్సాహ విధానాలతో పాటు, సంస్కరణల ప్రక్రియ వేగవంతం వంటి అంశాలతోనే బడ్జెట్‌ ఇప్పుడు ముందుకు రానుంది. ప్రత్యే కించి కార్పొరేట్లకు మేలు చేసే పనులను ఆద్యంతం పకడ్బందీగా ప్రవేశ పెట్టనున్నారు. గురువారం మధ్యాహ్నం ప్రవేశపెట్టే బడ్జెట్‌ కోసం వ్యాపార, పెట్టుబడిదారివర్గాలు ఆసక్తితో ఎదురుచూస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: