కేంద్ర బడ్జెట్‌లో విద్యుత్‌ రంగానికి సముచిత ప్రాధాన్యం కల్పిం చారు. విద్యుత్‌ ఉత్పత్తి, పంపిణీ సంస్థలకు అమల్లో ఉన్న పదేళ్ల టాక్స్‌ హాలిడేను మరో ఏడాది పొడి గించారు. నష్టాలతో కునారిల్లుతున్న విద్యుత్‌ సంస్థ లకు ఈ నిర్ణయం కొంత ఉపశమనం కలిగించింది. గుజరాత్‌లోని జ్యోతిగ్రాం యోజన పేరుతో నరేంద్ర మోడీ ప్రారంభించిన పథకాన్ని దేశవ్యాప్తంగా విస్త రించనున్నారు. దేశవ్యాప్తంగా గృహ, పారిశ్రామిక వినియోగదారులందరికీ 24 గంటల విద్యుత్‌ సర ఫరా చేయాలన్న ఈ బృహత్తర పథకానికి దీన్‌ద యాల్‌ ఉపాధ్యాయ గ్రామ్‌ జ్యోతి యోజన అని ప్రభుత్వం నామకరణం చేసింది. దీని కోసం రూ. 500 కోట్లు బడ్జెట్‌లో కేటాయించారు. నిరంతర విద్యుత్‌ సరఫరాకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉం దని ఆర్ధికమంత్రి అరుణ్‌జైట్లీ చెప్పారు. ఇందు కోసం సంప్రదాయ విద్యుత్‌ ఉత్పత్తి పెంచడంలో జరుగుతున్న జాప్యాన్ని నివారించడానికి చర్యలు తీసుకుంటామని కేంద్రం హామీనిచ్చింది. దీనికి ోడు పర్యావరణ హితంగా ఉండే సంప్రదాయేతర ఇంధన వనరుల ఆధారిత విద్యుత్‌ ఉత్పత్తికి తగిన ప్రోత్సాహాన్ని అందిస్తానని బడ్జెట్‌లో స్పష్టం చేసిం ది. మొత్తం మీద విద్యుత్‌ అభివృద్ధికి కేంద్రం పెద్ద ప్రణాళికలు రచిస్తోందని నిపుణుల అభిప్రాయం. కృష్ణపట్నం ప్రాంతాన్ని ఇండస్ట్రి యల్‌ స్మార్ట్‌సిటీగా ప్రకటించడంతో ఈ ప్రాంతంలో మరిన్ని విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాలు వచ్చే అవకాశం ఉంది. గ్రీన్‌ ఎనర్జీపై కరుణ పర్యావరణ ప్రియంగా ఉండే సౌర, పవన విద్యుత్‌పై ప్రభుత్వం కరుణచూపింది. పవన విద్యు త్‌కు ప్రోత్సాహకాలు ఇస్తామని చెబుతూనే, ఇందు కు ఉపయోగించే పరికరాలపై పన్ను తగ్గించింది. దీంతో పాటు పన్నుల్లో చేసిన మార్పులతో సౌరవి ద్యుత్‌ ఫలకాల ధర తగ్గుతుంది. క్లీన్‌ ఎనర్జీ సరఫరా కోసం అంటే, సౌర, పవన విద్యుత్‌ వినియోగం కోసం ప్రత్యేక కారిడార్‌ ఏర్పాటు చేసే ఆలోచన ఉన్న ట్లు మంత్రి ప్రకటించారు. క్లీన్‌ ఎనర్జీ పథకం కోసం రూ.100 కోట్లను కేటాయించారు. డిల్లిdలో విద్యుత్‌ సంస్కరణలకు రూ.200 కోట్లు కేటాయించారు. ఆంధ్రప్రదేశ్‌తో పాటు రాజస్థాన్‌, గుజరాత్‌, తమిళ నాడు, కాశ్మీర్‌లో ఆల్ట్రా మెగా సోలార్‌ పవర్‌ ప్రాజె క్టుల నిర్మాణానికి రూ.500 కోట్లు ప్రకటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: