సార్వత్రిక ఎన్నికల ముందు సినీ  హీరో పవన్ కళ్యాన్ స్థాపించి జనసేన పార్టీ స్థాపించారు అందరికి విదితమే. అయితే ఈ పార్టీ  పేరుతో సోషల్ నెట్ వర్క్ (ఫేస్ బుక్, ట్విట్టర్) లలో పవన్ కళ్యాన్ పేరు వాడటం కానీ ఎలాంటి ప్రకటనలు చేసినా,ఇచ్చినా అంతే కాకుండా ఆంధ్రప్రదేశ్ యొక్క పునర్ నిర్మాణం కోసం అని అక్రమంగా విరాళాలు సేకరించిన యెడల వాటితో ‘జనసేన’ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని జనసేన పార్టీ తెలియజేస్తుంది. ఒక వేళ ఇలాంటి చర్యలకు ఎవరైనా పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని వారు తెలిపారు. ‘జనసేన’ పార్టీ కేంద్ర ఎన్నికల సంఘం నుంచి పూర్తి స్థాయి గుర్తింపు వచ్చిన తర్వాత పార్టీ భవిష్యత్ కార్యాచరణను అధ్యక్షులు పవన్ కళ్యాన్ స్వంగా ప్రెస్ మీట్ పెట్టి పూర్తి వివరాలు వెల్లడిస్తారని తెలిపారు. అంతే కాకుండా జనసేన పేరు చెప్పి ఎలాంటి దుశ్శర్యలకు పాల్పడినా వారి పై చర్యలు తప్పవని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: