ప్రజాధనం అంటే అటు ప్రజాప్రతినిధులకు ఇటు అధికారులకు ఎంత నిర్లక్ష్యమో! బెంగళూరులో పలు కార్యాలయాల్లో విధులకు ఆటంకం కలిగిస్తున్న ఎలుకలను పట్టేందుకు బృహన్ బెంగళూరు మహానగర పాలికె (బీబీఎంపీ) నడుంబిగించింది. పనిలో చిత్తశుద్ధి లేకపోతే ఎలాంటి ఫలితాలు వస్తాయో ఇక్కడా అదే పరిస్థితి ఎదురైంది. ఎలుకలు పట్టే పథకానికి అయిన ఖర్చు రూ.2 లక్షలు. కాగా, కేవలం 20 ఎలుకలే పట్టారు.ఇందుకోసం ఆర్నెల్ల సమయం పట్టడం విస్తుగొలుపుతోంది. ఈ పథకం అమలుకు టెండర్లు కూడానూ. ఈ పథకం పేరు 'మూషిక నిర్వాహణే' అట. ఈ టెండర్లను దక్కించుకున్న మూడు కంపెనీలు చివరికు ఇరవై ఎలుకలు చూపి నిధులు బొక్కేశాయి. యొడియూర్ కార్పొరేటర్ రమేశ్ సమాచార హక్కు చట్టం సాయంతో ఈ వివరాలను సేకరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: