మొత్తానికి ప్రారంభించిన "జనసేన''ను ఎవరికి కావాలనుకొన్నట్టుగా వాళ్లు ఉపయోగించుకొంటున్నారు. ఎన్నికలకు ముందు జనాల ముందుకు వచ్చి ప్రశ్నిస్తానంటూ పార్టీని ప్రారంభించిన పవర్ స్టార్ ఇప్పుడు సినిమాలతో బిజీ అయిపోయినట్టుగా ఉన్నాడు. జనసేన అధినేతగా ఎన్నికలు అయ్యాకా ఆయనప్రజల మధ్యకు వచ్చింది లేదు. అయితే జనసేన మాత్రం ఫేస్ బుక్ లోనూ, పత్రిక ప్రకటనల రూపంలో కనిపిస్తోంది. ఇదే సమయంలో రాష్ట్రంలో విరాళాల సీజన్ కొనసాగుతోంది. రాజధాని నిర్మాణానికి అంటూ, ప్రభుత్వ మనుగడకు అంటూ ఎవరికి వారు విరాళాలు వసూలు చేయడం మొదలు పెట్టారు. దీనికి ప్రభుత్వం కానీ, న్యాయవ్యవస్థ కానీ అభ్యంతరం చెప్పకపోవడంతో... ఉత్సాహవంతులు కొందరు "జనసేన''ను కూడా ఉపయోగించేసుకొన్నట్టు తెలుస్తోంది! జనసేన, పవన్ కల్యాణ్ పిలుపు పేరుతో విరాళాలు వసూలు చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వ్యవహారం గురించి ఒక ఫేస్ బుక్ పోస్టుతో చేతులు దులిపేసుకొంది పవన్ పార్టీ. జనసేన పేరిట ఎవరైనా విరాళాలు వసూలు చేస్తే తమకు సంబంధం లేదని పత్రికా ప్రకటన విడుదల చేసి..మమ అనిపించారు. అయితే ఎంతమంది ఆ పత్రికా ప్రకటనను చదవుతారు? ఫేస్ బుక్ లో జనసేన ఖండనను చదువుతారు? అనేది అనుమానమే! ఈ వ్యవహారంపై పవన్ కల్యాణ్ జోక్యం చేసుకొంటే మంచిది అని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. తన స్థాపించిన పార్టీ ని కొంతమంది స్వార్థపరులుఉపయోగించుకొంటూ... అమాయక ప్రజలతో డబ్బులు వసూలు చేసుకొంటుంటే పవన్ తన మానాన తను ఉండటం భావ్యం కాదని, ఇలాంటి వారి తాట తీస్తానని పవన్ ఒక హెచ్చరిక చేస్తే మంచిదని వ్యాఖ్యానిస్తున్నారు. మరి పవన్ ఇలాంటి అన్యాయాలపై స్పందిస్తాడా?

మరింత సమాచారం తెలుసుకోండి: