తెలంగాణ ముఖ్యమంత్రిగా పాలనాపగ్గాలు అందుకున్న నెల రోజుల్లోనే కేసీఆర్ దూకుడుగా ఉన్నారు. వరుస నిర్ణయాలతో జోరుమీదున్నారు. అంతే కాదు.. వివిధ శాఖల అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ యమా బిజీగా ఉన్నారు. రోజుకో.. రెండు రోజులకో ఓ కొత్త విధానం ప్రకటిస్తూ.. ఔరా అనిపిస్తున్నారు. అవన్నీ వాస్తవ రూపం ఎప్పుడు దాలుస్తాయన్న సంగతి ప్రస్తుతాని పక్కన పెడితే.. ఈ సీఎం మహా స్పీడు గురూ అనే టాక్ తెచ్చుకున్నారు. కేసీఆర్ తెలంగాణకు సీఎం. ముఖ్యమంత్రి అంటే.. కనీసం ఓ అరడజను కార్లున్న కాన్వాయ్ తప్పనిసరి.. ఈ ఇంటి నుంచి పక్కింటికి వెళ్లినా ఈ ఫార్మాలిటీలు, సెక్యూరిటీలు, ప్రోటోకాల్సూ కామన్. మరి అలాంటి వాడు మోటార్ బైక్ పై వెళితే ఎలా ఉంటుంది. అబ్బే అలా ఎలా జరుగుతుందని ఆశ్చర్యపోకండి. అది కూడా ఏ విహారయాత్రకో.. ఆటవిడుపుకో కాదు సుమా.. అచ్చమైన అధికారిక కార్యక్రమానికి.. వారెవా.. వాటే ఇంట్రస్టింగ్ న్యూస్.. ఎప్పుడు.. ఎలా.. ఎందుకు అని ప్రశ్నలవర్షం కురిపించకండి.. అవును మరి కేసీఆర్ లాంటి బక్కప్రాణి మోటార్ బైక్ మీద వెళ్తుంటే.. చూడటానికి కాస్త వెరైటీగానే ఉంటుంది. అందులోనూ అఫీషియల్ ప్రోగ్రామ్ అంటే.. ఇంకాస్త ఇంట్రస్ట్.. ఇంతకీ కేసీఆర్ బైక్ మీద దూసుకుపోయేది ఎందుకోసమో తెలుసా.. నీటి ప్రాజక్టులపై అధ్యయనం చేసేందుకట. వారిని స్వయంగా పరిశీలించేందుకట. ప్రాజెక్టులకీ మోటార్ బైక్ కూ లింకేమిటనుకుంటున్నారా.. కార్లు, జీపులు లాంటి వాహనాలు వెళ్లలేని ప్రాంతాల్లోకి కేసీఆర్ మోటార్ బైక్ పై వెళ్తారట. దగ్గరనుంచి పరిశీలించి ప్రాజెక్టుల రూపకల్పనపై ఓ అభిప్రాయానికి వస్తారట. అదన్నమాట అసలు సంగతి. ప్రాజక్టుల పరిశీలన, రూపకల్పన కోసం అవసరమైతే.. ఆయా ప్రాంతాల్లో హెలికాప్టర్లలో ప్రయాణించాలని కేసీఆర్ ప్లాన్ రెడీ చేసుకుంటున్నారు. తెలంగాణలోని అన్ని జిల్లాలపై పూర్తి పట్టున్న కేసీఆర్.. మరింత అధ్యయనం కోసం ఈ ప్రయత్నం చేస్తున్నారట. ప్రత్యేకంగా హెలికాఫ్టర్ లో తెలంగాణలో కృష్ణ, గోదావరి పరివాహక ప్రాంతాలలో పర్యటిస్తారట. తనతో పాటు నిపుణులు, ఇంజనీర్లను కూడా తీసుకు వెళతారట. వాహనాలు వెళ్లలేని, కొండ ప్రాంతాలలో అవసరమైతే మోటార్ బైక్ పైనైనా పర్యటిస్తానని.. కేసీఆర్ చెబుతున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: