జడ్పీ ఎన్నికల్లో అక్రమాల గురించి తమ పార్టీ గుర్తుపై గెలిచిన వారిని అధికార పార్టీ తన వైపుకు తిప్పుకోవడం గురించి... వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వంలోని ముఖ్యులందరికి ఫిర్యాదు చేశాడు. ఇలాంటి ఫిరాయింపులు మామూలే అయినా.. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనంతగా, అధికార పార్టీ విజృంభించింది. తమకు కనీస బలం కూడా లభించని చోట కూడా తెలుగుదేశం వాళ్లు జడ్పీ చైర్మన్ లను, మున్సిపల్ చైర్మన్ పదవులను సొంతం చేసుకోవడానికి ప్రయత్నించారు. ఆ ప్రయత్నాల్లో విజయం సాధించారు. జరుగుతున్నది అక్రమమేనని అందరికీ తెలుసు.. ఫ్యాన్ గుర్తుపై గెలిచిన వాళ్లు సింపుల్ గా సైకిల్ పార్టీ వైపు వెళుతున్నారని తెలుసు.. అయినప్పటికీ నైతికత అనేదేమీ లేకుండా చైర్మన్ ఎన్నికలు జరిగాయి. మరి ఇంత జరిగితే జగన్ మోహన్ రెడ్డి గాంధీ గిరిని ఎంచుకొన్నాడు. తమ పార్టీ వాళ్లను ప్రలోభ పెట్టి, కొని తెలుగుదేశం చైర్మన్ పోస్టులను సొంతం చేసుకోవడం గురించి ప్రధానమంత్రికి, కేంద్ర హోంమంత్రికి, రాష్ట్రపతికి ఫిర్యాదు చేశాడు. తమ పార్టీ కార్యకర్తలను నరిచి చంపుతున్నారని, రాష్ట్రంలో పాలన చాలా దారుణంగా ఉందని, అధికారం అందిందనే ఉత్సాహంతో తెలుగుదేశం ప్రతిపక్ష పార్టీపై దౌర్జన్య కాండ సాగిస్తోందని జగన్ ఫిర్యాదు చేశాడు. అయితే ఒక ప్రభుత్వంపై వచ్చే ఫిర్యాదుల విషయంలో కేంద్ర ప్రభుత్వం ఏమీ చేయలేదని చెప్పవచ్చు! అందులోనూ ఎంత కాదనుకొన్నా బీజేపీకి తెలుగుదేశం పార్టీ కి మిత్రపక్షమే. అలాంటప్పుడు జగన్ మోహన్ రెడ్డి గాంధీ గిరి రూపంలో ఎంతగా గొంతు చించుకొన్నా... జరిగే దౌర్జన్యాలు ఆగవు, వైకాపా మద్దతు దారులకు ఇబ్బందులు తప్పవని అయితే చెప్పవచ్చు! ఇలాంటిఇబ్బందులను ఇంకా ఐదేళ్ల పాటు ఎలా తట్టుకొని నిలబడతారనేదాని మీదే వైకాపా భవితవ్యం ఆధారపడి ఉంటుందనడంలో కూడా ఎలాంటి సందేహం లేదు!

మరింత సమాచారం తెలుసుకోండి: