ఉత్తరాంధ్ర జిల్లాలలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల ఫలితాల తరువాత జోష్‌ తగ్గించేసింది. ఎన్నికల ముందు అంతా నాయకులే కనిపించారు ఫలితాల తరువాత వైసీపీ ప్రతిపక్ష స్ధానంలోకి రావడంతో ఉత్తరాంధ్రలో వైసీపీకీ ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలలో అరకు పార్లమెంటు స్ధానంతో పాటు తొమ్మిది అసెంబ్లీ స్ధానాలు లభించాయి. సంఖ్యాపరంగా చూస్తే ఓ కొత్త పార్టీకి ఇది మంచి బలాన్ని ఇచ్చేదిగానే చూడాలి. విశాఖ జిల్లాలో 3 విజయనగరం జిల్లాలో 3 శ్రీకాకుళం జిల్లాలో 3 అసెంబ్లీ స్ధానాలను వైసీపీ గెలుచుకుంది. గెలిచిన వారిలో దాదాపుగా అంతా కొత్త వారు ఆవడం సీనియర్లు ఓడిపోవడంతో పార్టీని ముందుకు తీసుకువెళ్లే నాధుడు కనిపించడంలేదు. శ్రీకాకుళం జిల్లాలో ఉద్దండులు ఉన్న వైసీపీలో ఇపుడు ఎవరికి వారే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. విశాఖ జిల్లా రాజకీయాలలో సీనియర్‌ అనదగిన నాయకుడు మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ. ఎందుచేతనో ఆయన చాలాకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ న్నారు. మొత్తం మీద చూసుకుంటే ఒకప్పుడు ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాలలోనూ ఉన్న 34 అసెంబ్లీ స్ధానాలలో 25 తక్కువ కాకుండా గెలుచుకుంటామన్న ధీమాను కలిగించిన నాయకులు కేడర్‌ ఇపుడు పూర్తిగా దిగాలుపడ్డారు. వారిని మళ్లీ చేరదీసి పార్టీ బాధ్యతలు అప్పగించాల్సిన అవసరం ఉంది. అధినేత వైఎస్‌ జగన్‌ అన్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: