అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఇటు తెలంగాణ సిఎం కెసిఆర్ తమ రాష్ట్రాల్లోకి పెట్టుబడులను ఆకర్షించేందుకు పోటీ పడుతున్నారు. మైక్రోసాఫ్ట్ సిఇఓ సత్య నదెళ్ల వచ్చేనెలలో హైదరాబాద్ నగరానికి రానున్నారని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో సత్య నదెళ్లతో భేటీ అయ్యేందుకు ఇరువురు ముఖ్యమంత్రులు ప్రయత్నాలు చేపట్టారు. సత్య నాదెళ్ల హైదరాబాద్ నగరంలో బస చేసిన సమయంలో ఇటు తెలంగాణ సిఎం కెసిఆర్, అటు ఆంధ్రప్రదేశ్ సిఎం నారా చంద్రబాబు నాయుడులతో వేర్వేరుగా సమావేశం కానున్నారని భావిస్తున్నారు. రెండు రాష్ట్రాల సిఎంలిద్దరూ తమ రాష్ట్రాల్లో ఐటి ప్రగతి సాధించేందుకు సత్య నదెళ్ల మద్దతు కోరనున్నారు. ‘‘సత్య నదెళ్ల వచ్చేనెలలో హైదరాబాద్ నగరానికి రానున్నారు, ఇంకా తేదీలు ఖరారు కాలేదు’’ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. సత్య నదేళ్ల పర్యటన కోసం వేచి చూస్తోంది. తద్వారా హైదరాబాద్ నగరంలో ఐటి పరిశ్రమ విస్తరణ అవకాశాలను తెలంగాణ ప్రభుత్వం, సత్య నదేళ్లతో చర్చించనున్నది. అదే విధంగా ఆంధ్రప్రదేశ్ సిఎం నారా చంద్రబాబు నాయుడు కూడా తమ రాష్ట్రంలో ఐటి రంగ అభివృద్ధికి సహకరించాలని సత్య నదేళ్లను కోరనున్నారు. ఇప్పటికే మైక్రోసాఫ్ట్, హైదరాబాద్ నగరంలో కార్యకలాపాలు విస్తరించాలని ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. సత్య నదేళ్ల రాక అందుకు దోహద పడుతుందని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: