రైతుల రుణమాఫి పిటిషన్ హైకోర్టు కొట్టివేసింది. రుణమాఫి చట్టవిరుద్దమని మాజీ ఎమ్మెల్యే అడుసుమల్లి జయప్రకాష్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వాజ్యము కింద దాఖలు చేశారు. అయితే దీనిపై ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోనందున జోక్యం చేసుకోమని న్యాయస్థానం తిరస్కరించింది. అడుసుమల్లి గతంలో రైతుల రుణమాఫీ పై ఈవిధంగా పిటిషన్ దాఖలు చేశారు.......  బ్యాంకుల నుంచి రైతులు తీసుకున్న రుణాలను ఆంధ్ర,తెలంగాణ ప్రభుత్వాలు మాఫీ చేసేందుకు చేసేందుకు ప్రయత్నాలు చెల్లవని , అక్రమమని ప్రకటించాలని కోరుతూ హైకోర్టులో విజయవాడ మాజీ ఎమ్మెల్యే అడుసుమల్లి జయప్రకాశ్ జూన్ 28 తేదీన పిటిషన్ దాఖలు చేశారు. ఈ రెండు రాష్ట్రప్రభుత్వాలు రుణాలను మాఫీ చేయడం వల్ల ప్రజాధనం దుర్వనియోగం చేసినట్లవుతుందని, దేశ ఆర్థిక వ్యవస్థకు దెబ్బని ఆయన పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ లో 54 వేల కోట్ల రూపాయలు, తెలంగాణలో 20వేల కోట్ల రూపాయలు కలిపి 74 వేల కోట్ల రూపాయల వరకు రైతుల రుణాలు ఉన్నాయన్నారు. రెండు ప్రభుత్వాలకు రుణాలను మాఫీ చేసే అధికారం లేదని పిటిషనర్ కోర్టును కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి: