ఎర్రకోక కట్టిందల్లా నా పెళ్లామే అంటే ఎలా అని ఓ మోటు సామెత ఉంది. అమాయక భర్తలను ఉడికించడానికి.. వారి పరధ్యానాన్ని వెటకారం చేయడానికి ఈ సామెత ఉపయోగిస్తారు. సామెత సంగతి ఎలా ఉన్నా.. ఎర్రకోక కడితే మాత్రం వెర్రెక్కడం ఖాయమంటున్నారు పరిశోధకులు... కేవలం ఆడవారే కాదు.. ఎరుపు రంగు డ్రస్ వేసుకున్న ఎవరైనా సెక్సీగా కనిపిస్తారట. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. వేల సంఖ్యలో మహిళలను ప్రశ్నించిన తర్వాత పరిశోధకులు ఈ కంక్లూజన్ కు వచ్చారు. ఎర్ర డస్ వేసుకున్న అబ్బాయిలంటే ఇష్టపడటమే కాదట. ఎరుపు రంగు దుస్తులు ధరించిన అమ్మాయిల నుంచి తమ ప్రియుడుకి కానీ.. భర్తకు కానీ ప్రమాదం ఉంటుందని ఆందోళన చెందుతున్నారట మహిళలు.. రొచెస్టర్ యూనివర్సిటీ, త్రణ్వా యూనివర్సిటీ, స్లొవాక్ అకాడమీల నిర్వహించిన సర్వేల్లో ఈ విషయం బయటపడింది. అందుకేనేమో సినిమాల్లో హీరోయిన్లు కూడా ఎరుపు రంగు డ్రెస్సులు వేసుకుని ఐటమ్ సాంగ్స్ లో అదరగొడుతుంటారు. రా.వన్ సినిమాలో ఛమ్మక్ చల్లో అంటూ కరీనా రెచ్చిపోవడం అందుకు ఓ ఉదాహరణ మాత్రమే. తెలుపు, ఎరుపు దుస్తులు ధరించిన మహిళల డిజిటల్ ఇమేజ్‌లను చూపించి అందులో ఎవరు సెక్సీగా ఉన్నారని ప్రశ్నిస్తే చాలామంది మగవాళ్లు.. ఎరుపే రొమాంటిక్ కలర్ అని చెప్పారంట. ఎరుపు, ఆకుపచ్చ రంగులలో దేన్ని ఇష్టపడుతారన్న అంశంపై సర్వే చేశారు. ఈ సర్వేలో కూడా రెడ్‌కే మగువలు గ్రీన్‌సిగ్నల్ చూపారు. ఈ సర్వేలన్నీ అమెరికా,యూరప్ లలో నిర్వహించారు. టోటల్ రిపోర్ట్ ను పర్సనాలిటీ, సోషల్ సైకాలజీ అనే మ్యాగజైన్లో ప్రచురించారు. మరి ఇంకెందుకు ఆలస్యం.. ఎర్రడ్రెస్ వేసుకోండి.. మీ భాగస్వామిని శృంగార యుద్ధానికి ఆహ్వానం పలకండి.

మరింత సమాచారం తెలుసుకోండి: