తమను తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీష్ రావు అసభ్య పదజాలంతో దూషించాడని కొంతమంది విద్యార్థులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. సిటీ కాలేజ్ లో జరిగిన ఒక కార్యక్రమానికి హాజరైన హరీష్ రావుతను తమ విజ్ఞప్తుల గురించి చెప్పడానికి కలిశామని, ఈ సందర్భంగా ఆయన తమను బూతులు తిట్టాడని వారు పోలీసులకు మొరపెట్టుకొన్నారు. ఆయనపై తక్షణం చర్యలు తీసుకోవాలని కోరుతూ వారు చార్మినార్ స్టేషన్ పోలీసులకు కంప్లైట్ ఇచ్చారు. మరి ఇది వరకూ అనేక మంది నోరు పారేసుకొన్న హరీష్ రావు ఇప్పుడు మంత్రి హోదాలో విద్యార్థులపై నోరు చేసుకొన్నాడని అనుకోవాల్సివ స్తోంది. ఇది వరకూ ఆయన ఎప్పుడు ఎవరిని బూతులు తిట్టినా.. అది ఆంధ్ర- తెలంగాణ గొడవలా కనిపించేది. ఇప్పుడు తెలంగాణ విద్యార్థులపైనే... తెలంగాణ మంత్రిగా హరీష్ రావు బూతులు లంకించుకోవడం విశేషంగా మారింది. ఇక ఇదే సమయంలో విద్యార్థులకు అండగా నిలబడతామని అంటోంది కాంగ్రెస్ పార్టీ. కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేయడాన్ని వ్యతిరేకిస్తున్న వాళ్లకు తమ మద్దతు ఉంటుందని కాంగ్రెస్ నేతలు ప్రకటిస్తున్నారు. దీన్ని బట్టి కాంగ్రెస్ వాళ్లు రాజకీయం మొదలు పెట్టారని అనుకోవాల్సి వస్తోంది. ఇక ఓయూలో విద్యార్థుల ఆందోళనలను పరిగణలోకి తీసుకొని..కేటీఆర్ ఓయూ పర్యటనను కూడా రద్దు చేసుకొన్నాడని సమాచారం. ఈ పరిణామాలను బట్టి.. ఓయూతో టీఆర్ఎస్ కు శత్రుత్వంపెరుగుతోందని చెప్పవచ్చు. ఇది వరకూ తెలంగాణ ఉద్యమ సమయంలో ఓయూ టీఆర్ఎస్ కు బాగా ఇష్టమైన స్థానం గా నిలిచింది. ఇతర పార్టీల వాళ్లు ఓయూలోకి అడుగుపెట్టాలంటేనే భయపడే పరిస్థితి. తెలంగాణ రాష్ట్ర సమితి నేతలకు మాత్రం అప్పట్లో ఓయూ ఒక స్వర్గధామంగా కనిపించింది. అయితే తెలంగాణ వచ్చాకా.. ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికార పార్టీగా అవతరించాకా మాత్రం ఓయూతో శత్రుత్వం పెరుగుతోంది. మరి ఇది ఏ పరిణామాలకు దారి తీస్తుందో!

మరింత సమాచారం తెలుసుకోండి: