తెలుగుదేశం పార్టీకి నిధులు ఇవ్వండి... రాష్ట్ర పాలనతో మీ ప్రాధాన్యతను పెంచుకోండి.. అన్నట్టుగా ఉందట ఇప్పుడు వ్యవహారం. తెలుగుదేశం పార్టీకి పార్టీ ఫండ్ రూపంలో నిధులు ఇచ్చిన వారికి , ప్రభుత్వ విధానాల్లో జోక్యం చేసుకొనేందుకు అవకాశం లభిస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. జరుగుతున్న పరిణామాలు ఇలాంటి విమర్శలకు అవకాశం ఇస్తున్నాయి.ఇటీవలి కాలంలో అటు ప్రభుత్వ పరంగా, ఇటు పార్టీ పరంగా తెలుగుదేశం వాళ్లు నిధుల సేకరణకు చాలా ప్రాధాన్యతను ఇస్తున్నారు. మహానాడులో ప్రత్యేకంగా హుండీలను పెట్టి నిధుల సేకరణ చేశారు, ఇక విరాళల విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించారు. ఎలాగూ పార్టీ కూడా అధికారంలోకి వచ్చింది కాబట్టి.. చాలా మంది విరాళాలు ఇవ్వడానికి ముందుకొచ్చారు. పార్టీకి విరాళాలు ఇస్తే..పనులు చేయించుకొవచ్చనేది ఆ దాతల భావన. క్విడ్ ప్రో కో అనమాట. పార్టీకి నిధులు ఇస్తే.. ప్రభుత్వం అనుకూలంగా ఉంటుంది. కాంట్రాక్టులు దక్కుతాయి. ఈ లెక్క ప్రకారం.. ఇప్పుడు రాజధాని కమిటీలో కూడా తెలుగుదేశం పార్టీకి అనుకూలమైన వారికి ప్రాధాన్యత దక్కిందని తెలుస్తోంది. సీమాంధ్రకు కొత్త రాజధాని నిర్మాణం కోసం తగిన ప్రాంతాన్ని ఎంపిక చేయడానికి నియమితమైన కమిటీలో తెలుగుదేశం పార్టీ దాతలే ఎక్కువమంది ఉన్నారని సమాచారం. తెలుగుదేశం పార్టీకి భారీగా నిధులు ఇచ్చిన వాళ్లు, ఫండ్స్ ద్వారా ఆ పార్టీని ఉద్ధరించిన వారికే ఈ కమిటీలో చోటిచ్చారట. రాజధాని ఏర్పాటు కమిటీలో ఒక్క నిపుణుడు కూడా లేడట! ఎలాంటి శాస్త్రీయత కూ అవకాశం లేకుండానే... ఈ కమిటీని ఏర్పాటు చేశారట. దీనిపై కాంగ్రెస్ వాళ్లు కూడా మండిపడుతున్నారు. రాజధాని ఎంపిక కమిటీలో ఒక్క నిపుణుడు కూడా లేడని...అంతా తెలుగుదేశం అనుకూలమైన వాళ్లు అందులో ఉన్నారని... ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి ఆందోళన వ్యక్తం చేశాడు. ఈ కమిటీని పునఃసమీక్షించాలని ఆయన కోరుతున్నాడు. మరి అధికారం తెలుగుదేశం చేతిలో ఉంది... వాళ్ల ఇష్టానుసారం జరుగుతుంది ఇప్పుడు ఏదైనా.. కాంగ్రెస్ వాళ్ల మాట, నిపుణుల మాటతో ఏం పనుంది?!

మరింత సమాచారం తెలుసుకోండి: