ఆర్ధికంగా ఎన్ని కష్టాలు, ఇబ్బందులున్నా.... రిజర్వు బ్యాంక్‌ కొంత మేరకే సహకరించినా... రైతుల రుణమాఫీ చేయాల్సిందేనని రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం నిర్ణయించింది. మంత్రివర్గ సమావేశంలో గంటల తరబడి రుణమాఫీ పైనే చర్చ జరిగింది. ఆసక్తికరమైన విషయాలేమిటంటే... మంత్రి నారాయణ రుణమాఫీ పరిమితిని లక్షా 20 వేలు చేద్దామని సూచించారట. దీనిపై మీటింగ్ లో హాట్ హాట్ చర్చ జరిగిందట. దీన్ని చాలా మంది వ్యతిరేకించారట. ప్రత్యేకించి మంత్రులు దేవినేని ఉమ, అచ్చెన్నాయుడు గట్టిగా అడ్డు చెప్పారట. ఎలాగూ ఇస్తున్నాం.. అదేదే ఘనంగానే ఇద్దాం అన్నారట. రుణమాఫీ ప్రతిష్టాత్మక పథకం కాబట్టి ఇందులో మళ్లీ కొర్రీలు పెడితే జనంలో వ్యతిరేకత వస్తుందని చాలామంది మంత్రులు అభిప్రాయపడ్డారు. లక్షన్నర వరకూ మాఫీ చేస్తే.. రైతు సంతోషంగా ఉంటారని.... ఎన్ని ఇబ్బందులున్నా తేదేపా ప్రభుత్వం చేసిందని హర్షిస్తారని అన్నారట. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా... రైతులను ఆదుకోవడం మన బాధ్యత... రైతులకు కచ్చితంగా రుణమాఫీ చేయాల్సిందే.. ప్రతి కుటుంబానికి లక్షన్నర వరకూ చేద్దామని అన్నారట. మంత్రివర్గ సమావేశంలో జగన్ విమర్సలపైనా ఇంట్రస్టింగ్ గా డిస్కషన్ జరిగిందట. ఆచరణ సాధ్యం కాని హామీలిచ్చారని వైకాపా అధినేత జగన్‌ చేస్తున్న విమర్శలపై చర్చ జరిగిందట. మనం కాబట్టే... ఎన్ని ఇబ్బందులు ఎదురయినా రుణమాఫీ చేస్తున్నామని.. అనుభవం లేని జగన్‌ అయితే ఇప్పటికే చేతేలెత్తేసి ఉండేవాడని కొందర మంత్రులన్నారట. రుణమాఫీ అమలు నిధుల సమీకరణ కోసం... మంత్రులు తమ తమ శాఖల పరిధిలో కొత్త కార్యక్రమాలు, పధకాలు ఒక ఏడాది పాటు వాయిదా వేయాలన్న అభిప్రాయం సమావేశంలో వ్యక్తమైంది. డ్వాక్రా రుణాల మాఫీపైనా మంత్రివర్గం చర్చించింది. ప్రతి బృందానికి లక్ష రూపాయల వరకు మాఫీ చేయాలని నిర్ణయించింది. మాఫీ చేసిన డబ్బుతో మహిళా బ్యాంకు ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన పైన చర్చ జరిగింది. ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో పనిచేసే కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణ అంశంపై కూడా మంత్రివర్గం చర్చించింది. ఇందుకు మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: