ఎన్నికల సందర్భంగా చంద్రబాబునాయడు వ్యవసాయ, డ్వాక్రా, చేనేత, ఎస్సీ రుణాలను మాఫీ చేస్తానని స్పష్టమైన హామీ ఇచ్చారు. రాష్ట్రం సమైక్యంగా ఉన్నప్పటికన్నా విభ జన జరిగిన తర్వాత రాష్ట్ర ఆర్దిక పరిస్దితి అధ్వాన్నంగా ఉన్నట్లు తెలిసిందంటున్నారు. మొదట్లో మొత్తం రుణ మాఫీ అంచనా సుమారు 87 వేల కోట్ల రూపాయలుగా తేలింది. ఈ మొత్తాన్ని మాపీ చేయాలన్న ఉద్దేశ్యంతోనే చంద్రబాబు కసరత్తు మొదలుపెట్టినా రోజులు గడిచేకొద్దీ మొత్తం రుణమాఫీ సాధ్యం కాదన్న విషయం చంద్రబా బుకు బోధపడింది. దాంతో ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీ కారం చేయగానే రుణమాఫీపై తొలి సంతకం చేస్తానని చెప్పిన చంద్రబాబు రుణమాఫీ విధివిధానాలను ఖరారు చేయటం కోసమని ఒక కమిటీ వేసినట్లు ప్రకటించారు. ఇందులో భాగంగానే కుటుంబానికి ఒక రుణం మాత్రమే మాఫీ, పంట, బంగారు రుణాలన్నీ కలిపి 1.5లక్షల రూపాయలకే పరిమితం అంటూ షరతులు విధించారు.  దాంతో ఇప్పటి వరకూ అందరూ చెబుతున్న సుమారు లక్ష కోట్ల రుణాలు కాస్త దాదాపు 40 వేల కోట్ల రూపాయ లకు తగ్గిపోయింది. కుటుంబానికి ఒకే రుణమన్నది ప్రభుత్వం విదించిన షరతుల్లో ప్రధానమైనది. ఒకే కుటుంబంలో వ్యవసాయ అవసరాలకే బంగారం తాకట్టు పెట్టి ఒక రుణం, పట్టాదారు పుస్తకాలను తనఖా పెట్టి మరో రుణం తీసుకుంటారు. రైతు కుటుంబాల్లో ఇవన్నీ సహజమే. ఈ విషయం రైతు కుటుంబంలో జన్మించాని, తానూ వ్యవసాయం చేశానని తరచూ చెబుతుండే చంద్ర బాబుకు తెలీకుండా ఉండదు. అయితే, ఇపుడు మాత్రం కుటుంబానికి ఒకే రుణం అన్న షరతుతో పెద్ద భారాన్ని చంద్రబాబు దించేసుకున్నారు.  ఒక కుటుంబంలో సుమా రు మూడు లక్షల రూపాయల రుణం తీసుకుని ఉంటే చంద్రబాబు లెక్కల ప్రకారం బాం్యకులో రుణ విముక్తి లభించేది కేవలం లక్షన్నరకు మాత్రమే. మరి మిగిలిన లక్షన్నర రూపాయల రుణం మాటేమిటి? లక్షన్నర రుణా న్ని ప్రభుత్వం తీర్చినా, మిగిలిన లక్షన్నర రుణం తీరే వర కూ బ్యాంకులు సదరు కుటుంబానికి కొత్త అప్పులు ఇవ్వ వు. పాత అప్పు తీరక, కొత్త అప్పు పుట్టక మరి రైతు వ్యవ సాయ పనులు ఎప్పుడు మొదలుపెట్టాలి? మొత్తం వ్యవ సాయ రుణాలు తీసుకున్న రైతులు ప్రభుత్వ లెక్కల ప్రకా రమే కోటిమంది. ఈ కోటి మందిలో ప్రభుత్వ నిర్ణయం వల్ల సుమారు 96 శాతం మంది లబ్దిపొందుతున్నట్లు చంద్రబాబు చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: