రతీయ పౌరవిమానయాన రంగానికి మరింత ఊపు రానుంది. ఒకే నెలలో కొత్తగా ఆరు సంస్థలు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ నుంచి నో ఆబ్జెక్షన్‌ లేఖలు పొందాయి. ఇందులో మూడు జాతీయ ఎయిర్‌లైన్స్‌. మరో మూడు రీజనల్‌ ఎయి ర్‌లైన్స్‌. అనుమతి పొందిన వాటిలో హైదరాబాద్‌ కేంద్రం ఏర్పాటైన టర్బో మేఘ కూడా ఉంది. ఇందులో చిరంజీవి తనయుడు, ప్రముఖ హీరో కొణిదల రామ్‌చరణ్‌ తే, వంకాయలపాటి ఉమేష్‌ ఇందు లో ప్రధాన భాగస్వాములుగా ఉన్నారు. చార్టర్‌ కార్యకలాపాలు ప్రారంభిం చేందుకు ముందుగా, ఆరంభంలో ఇది ఆయా ఎయిర్‌లైన్స్‌కు గ్రౌండ్‌ హ్యాండ్లింగ్‌ సేవలు అందించనుంది . హైదరాబాద్‌ నుంచి ఈ సంస్థ ఒక చాపర్‌, రెండు చిన్న జెట్‌ విమానాలను నడుపనున్నట్లు సమాచారం. నో ఆబ్జెక్షన్‌ లేఖలు పొందిన వాటిలో ఎయి ర్‌ వన్‌ ఏవియేషన్‌, జెక్సస్‌ ఎయిర్‌, ప్రీమియర్‌ ఎయిర్‌ (నేషనల్‌ ఎయిర్‌లైన్స్‌), టర్బో మేఘ, ఎయిర్‌ కార్నివాల్‌, జావ్‌ ఎయిర్‌వేస్‌ (రీజనల్‌) ఉన్నాయి. ఇవన్నీ కూడా 2012-13లో దరఖాస్తు చేసుకున్నాయి. ఇవి గనుక తమ కార్యకలాపాలను కొనసాగించదలిస్తే, డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డీజీసీఏ) నుంచి లైసెన్స్‌ పొందాలి. ఎయిర్‌ వన్‌ ఏవియేషన్‌ను ఎయిర్‌ సహారా మాజీ ప్రెసిడెంట్‌ అలోక్‌ శర్మ ప్రమోట్‌ చేశారు. ప్రీమియర్‌ ఎయిర్‌ను ఎన్‌ఆర్‌ఐ ఉమాపతి పినాకపాణి నెలకొల్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: