ఆంధ్ర మేధావుల ఫోరం నేత చలసాని ప్రసాద్ ఒక ఆసక్తికరమైన కామెంట్ చేశాడు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అపాయింట్ తమ బోటి వారికి దక్కడం లేదని ఆయన అన్నాడు. సమైక్యాంధ్ర ఉద్యమం సమయంలో సీమాంధ్ర ప్రయోజనాల కోసంపోరాడిన తమకు ఇప్పుడు బాబు అపాయింట్ మెంట్ కూడా ఇవ్వనంత బిజీగా మారిపోయాడని చలసాని ప్రసాద్ అన్నాడు. చంద్రబాబు గారి దగ్గర మేధావులకు, ప్రొఫెసర్లకు, సామాన్యులకు అపాయింట్ మెంట్ కూడా దక్కడం లేదని ప్రసాద్ అన్నాడు. మరి ఈయన ఎన్నిసార్లు బాబు అపాయింట్ మెంట్ కోసం ప్రయత్నించి విఫలుడు అయ్యాడో తెలియదు కానీ... ఈ స్టేట్ మెంట్ అయితే ఇచ్చేశాడు. బాబు ఇప్పుడు సీమాంధ్ర పునర్నిర్మాణం కోసం పనిచేస్తున్నానని అన్నాడు. అలాంటప్పుడు ఇలాంటి మేధావుల సలహాలు, సూచనలు కూడా స్వీకరించాల్సి ఉంటుంది. మరి ఇలాంటి తరుణంలో వీళ్లకు అపాయింట్ మెంట్ లు కూడా దొరకకపోవడం నిజంగా ఆలోచించాల్సిన విషయమే. సీమాంధ్ర రాజధాని నిర్మాణం కోసం సింగపూర్ వెళ్లొస్తామని, అక్కడి పరిస్థితుల గురించి అధ్యయనం చేస్తామని బాబు క్యాబినెట్ లోని మంత్రలు అంటున్నారు. మరి అంతంత ఖర్చులు చేసి విదేశాలకు వెళ్లే ముందు.. ఇలాంటి మేధావుల అభిప్రాయాలను, వాళ్ల ఆలోచనలు కూడా పట్టించుకోవాల్సిందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. మేధావులు అంటే.. వాళ్లేమీ కాంగ్రెస్ వాళ్లు కూడా కాదు. కాంగ్రెస్ ను తీవ్రంగా వ్యతిరేకించిన వాళ్లు. విభజనను వ్యతిరేకించిన వాళ్లు. మరి అలాంటి వారిని కలుపుకుపోవాల్సిందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో మేధావులే తమకు బాబు అపాయింట్ మెంట్ కూడా ఇవ్వలేదని అంటున్నారు. ఈ పరిస్థితిలో మార్పు రావాలేమో!

మరింత సమాచారం తెలుసుకోండి: