తెలిసి జరుగుతున్నాయో.. తెలియక జరుగుతున్నాయో కానీ... వైకాపా లో ఇంకా పొరపాట్ల మీద పొరపాట్లు జరుగుతూనే ఉన్నాయి. ఎన్నికల్లో ఓటమి తర్వాత... జరిగిన పొరపాట్లను సరిదిద్దుకొని ముందుకు సాగాల్సిన వైకాపా నేతలు అనవసరమైన మాటలు మాట్లాడుతున్నారు. అది కూడా ఎవరో అనామక నేతలు కాదు.. పార్టీలో ఉన్నత స్థాయిలో ఉన్న నేతలే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. అందులో ప్రముఖమైనవి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి మాటలు. జగన్ మోహన్ రెడ్డికి చెందిన సాక్షి దిన పత్రిక వైకాపా ఓటమికి ఒక కారణమని ఇటీవల పెద్దిరెడ్డి వ్యాఖ్యానించాడు. సాక్షి అతి విశ్వాసాన్ని కలిగించిందని... అందువల్లనే పార్టీలో చాలా మంది నేతలు పనిచేయడం మానేశారని పెద్దిరెడ్డి సూత్రీకరించాడు. ఈ విషయం నిజం కూడా అయ్యుండొచ్చు. అయితే ఇది బహిరంగంగా మాట్లాడాల్సిన అంశం కాదు. పార్టీ అంతర్గత సమావేశాల్లో ఇలాంటి విషయాల గురించి చర్చించవచ్చు. తప్పొప్పుల గురించి మాట్లాడవచ్చు. అయితే ఇలా బహిరంగంగా మాట్లాడటం వల్ల పార్టీకి జరిగే నష్టం చాలా ఎక్కువ. ఇప్పటికే వైకాపా కు శత్రులు అనేక మంది ఉన్నారు. వాళ్లు అనేక రకాలుగా దాడి చేస్తున్నారు. వైకాపా అంతర్గత వ్యవహారాల గురించి తెలుసుకొని బయటకు వెళ్లిన నేతలూ ఉన్నారు. వాళ్లు కూడా జగన్ పై ఎన్నికల ముందునుంచే విరుచుకుపడుతున్నారు. మరి ఇలాంటి వారందరినీ తట్టుకోవడం వారందరినీ నియంత్రించడమే వైకాపా అధినేతకు పెద్దపని. మరి ఇప్పుడు పార్టీలోని పెద్దతలలే ఇలా మాట్లాడితే... మరింత బరువు అవుతుంది. అయినా అంతర్గత వేదికలపై మాట్లాడక ఇలా బయట మాట్లాడటం వల్ల ఈ నేతలు సాధించేదేమిటి?!

మరింత సమాచారం తెలుసుకోండి: