దేశ ప్రధానిగా మోడీ పీఠాన్ని ఎక్కారు. కొన్ని విదేశాల్లో పర్యటించారు. అమెరికా పర్యటన గురించి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చింది. మరో రెండు నెలల్లో అమెరికా పర్యటనకు కూడా వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారు. తాజాగా అమెరికాకు చెందిన సిక్కుల హక్కుల సంఘం వైట్ హౌస్ లో మోడీకి వ్యతిరేకంగా పిటిషన్ దాఖలు చేశారు. గతంలో కాంగ్రాస్ అధినేత్రి సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు వ్యతిరేకంగా ఇలాంటి పిటిషన్లను దాఖలు చేశారు. తాజాగా ప్రెసిడెంట్ ఒబామా మోడీని అమెరికాకు ఆహ్వానించడాన్ని వ్యతిరేకిస్తూ ఈ ఆన్ లైన్ పిటిషన్ దాఖలు చేశారు. 2002 గుజరాత్ అల్లర్లకు ఆయనే కారణమని వారు పిటిషన్ లో చేర్చారు. మోడీని, బీజేపీ పార్టీని వ్యతిరేకిస్తున్నామన్నారు అమెరికా సిక్కులు. మోడీ ముస్లింలు, సిక్కులు, క్రిస్టియన్లకు వ్యతిరేకని పిటిషన్ లో కంప్లైంట్ చేశారు. సెప్టెంబర్ లో మోడీ అమెరికాలో పర్యటించనున్నారు. 1984లో గోల్డెన్ టెంపుల్ పై దాడికి మద్దతుగా ఉన్నారని, 2008లో బీజేపీ ఒరిస్సాలో క్రిష్టయన్ల హింసకు కారణమని పిటిషన్లో చేర్చారు. ఆగస్టుల 20 లోపు ఈ పిటిషన్ పై లక్ష ఉద్యోగాలు పెట్టించేందుకు వారు సన్నాహాలు చేస్తున్నారు. సిక్కుల హక్కులకు వ్యతిరేకంగా సోనియా, మన్మోహన్ లు పనిచేశారని వారిపై గతంలో పిటిషన్ దాఖలు చేశారు. 1984లో అప్పటి ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ సిక్కులకు వ్యతిరేకంగా కొన్ని నిర్ణయాలు తీసుకున్నారని వారు ఆరోపించారు. దీంతో సిక్కుల పిటిషన్ సీరియస్ అయితే మోడీ పర్యటనకు కాస్త ఆటంకం కల్గించవచ్చని అక్కడి రాజకీయ ప్రముఖులు అంచనా వేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: