ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నరేంద్రమోడీ ఈ 50 రోజుల్లో రెండు విదేశీ పర్యటలు చేశారు. బూటాన్‌తో పాటు.. ఇటీవల బ్రిక్స్‌ సదస్సు కోసం బ్రెజిల్‌ వెళ్లిన మోడీ విదేశీ టూర్‌ ముగించుకుని భారత్‌ చేరుకున్నారు. ఈ రెండు పర్యటనల్లో ఓ ఆసక్తికర అంశం ఉంది. మీడియాను అనుమతించకపోవడం. సాధారణంగా ప్రధానమంత్రి విదేశీ పర్యటనలకు వెళితే తన ఎయిర్‌ ఇండియా వన్‌ విమానంలో మీడియాను కూడా తీసుకెళతారు. అందులో 34 బిజినెస్‌ సీట్లు మీడియాకోసమే ఉంటాయి. కానీ మీడియాను తన విమానంలో అనుమతించవద్దని అధికారులను మోడీ ఆదేశించారట. అందుకే బూటాన్‌, బ్రెజిల్ పర్యటనల్లో హడావిడి కనిపించలేదు. కొన్ని ఛానల్స్‌ మాత్రం సొంతంగా ప్రయాణం ఏర్పాట్లు చేసుకున్నాయి. గత ప్రధానుల పాలసీలకు భిన్నంగా వ్యవహరించడానికి మోడీ నాలుగు కారణాలు చెబుతున్నారట. మీడియాకు కావాల్సింది సమాచారం. సోషల్‌ మీడియా.. అంతర్జాతీయ మీడియా ఎజెన్సీల ద్వారా ఎప్పటికప్పుడు వివరాలు అందుతున్నాయి. వాటిని తెలుసుకోవడానికి ప్రత్యేకంగా మీడియా తనతోనే రావాల్సిన అవసరం లేదని భావిస్తున్నారట. సాంకేతిక సాకులతో పదేపదే పెద్దపెద్ద మీడియా సంస్థల ప్రతినిధులు మాత్రమే వస్తున్నారని.. దీంతో చిన్న పత్రికలు, ప్రాంతీయ మీడియా సంస్థల నుంచి విమర్శలొస్తున్నాయని మరో కారణం చెప్పారట. కేవలం 30 మందిని మాత్రమే తీసుకెళ్లడం మిగిలిన వందల మందిని అసహనానికి, అసంతృప్తిని గురి చేయడేమనని మోడీ అంటున్నారట. అందుకే కీలకమైన నిర్ణయాలు తీసుకుంటే విదేశీ పర్యటల నుంచి రాగానే ప్రెస్‌మీట్‌ పెట్టి వెల్లడిస్తే సరిపోతుందని మోడీ భావించారట.

మరింత సమాచారం తెలుసుకోండి: