రైతుల రుణ మాఫి విషయంలో తెలంగాణ రాష్ట్ర సర్కార్‌ అన్నదాతల విశ్వాసాన్ని పొందలేకపోతోందని టి పిసిసి అధ్యక్షుడు పొ న్నాల లక్ష్మయ్య పేర్కొన్నారు. రుణ మాఫి ఉంటుందా ఉండదా అన్న దానిపై స్పష్టత లేకుండాపోయిందని చెప్పారు. బుధవారంనాడు గాంధీభవన్‌లో పిసిసి కిసాన్‌ సెల్‌ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి హాజరైన పొన్నాల లక్ష్మ య్య మాట్లాడుతూ రైతుల రుణమాఫిపై ఇంతవరకు స్పష్టత రాలేదని, అన్నదా తల్లో సర్కార్‌ విశ్వాసం కల్పించలేకపోతోందని చెప్పారు. వెంటనే రైతుల రు ణాలన్నీ మాఫి చేసి కొత్త రుణాలు మంజూరు చేయాలని ఆయన డిమాండ్‌ చే శారు. ఇంతవరకు ఖరీఫ్‌ రుణాలు ఇవ్వడం ప్రారంభం కాకలేదన్నారు. వెంట నే రైతులకు ఖరిఫ్‌ రుణాలు అందేలా చేయాలని రాష్ట్ర సర్కార్‌ను ఆయన డిమాండ్‌ చేశారు. కిసాన్‌ సెల్‌ అధ్యక్షులు కోదండారెడ్డి మాట్లాడుతూ రైతుల రుణ మాఫిని ఎగొటడానికే నాగిరెడ్డి కమిటీ పేరుతో టి సర్కార్‌ కాలయాపన చేస్తోందన్నారు. రుణ మాఫి కోసం కేబినేట్‌లో నిర్ణయం తీసుకొన్నాక మళ్లీ నా గిరెడ్డి కమిటి ఎందుకని ఆయన ప్రశ్నించారు. పంటబీమా, ఇన్‌పుట్‌ సబ్సిడీపై తెలంగాణ సర్కార్‌కు ఎలాంటి స్పష్టత లేదన్నారు. ఒక పక్క రైతులు కష్టాలు పడుతుంటే మరోవైపు బ్యాంకులు అప్పులు చెల్లించాలని వీరికి నోటీసులు ఇస్తున్నాయని ధ్వజమెత్తారు. ఎప్పటిలోగా రుణమాఫి చేస్తారో తెలంగాణ ము ఖ్యమంత్రి కెసిఆర్‌ స్పష్టత ఇవ్వాలని ఆయన డిమాండ్‌ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: