మెదక్ జిల్లాలో ఈ రోజు జరిగిన రైలు ప్రమాదంలో 16 మంది విద్యార్థులు మృతి చెందగా వారి మృతదేహాలు గుర్తు పట్టనంతగా మరాయి. అయితే ఈ ఘటనలో బస్సును రైలు  దాదాపు కిలో మీటరు దూరం ఈడ్చుకు వెళ్లడం వల్ల  బస్సు నుజ్జు నుజ్జు కావడంతో బస్సులో ఉన్న విద్యార్థులు చెల్లా చెదురై విగతజీవులయ్యారు. ఈ సంఘటనపై ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడిన విద్యార్థులకు మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు. ప్రమాదాని కారణం ఈ సంఘటనపై వెంటనే విచారణ చేప్పట్టాలని ఆదేశించారు. మంత్రి హరీష్ రావు సంఘటన స్థలానికి వెంటనే బయలు దేరారు. అయితే బస్సలు ముగ్గురు టీచర్లు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. మోదక్ జిల్లా ముసాయిపేట రైల్వే గేట్ వద్ద గతంలో కూడా చాలా ప్రమాదాలు చోటు చేసుకున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. కానీ ఇప్పటికీ రైల్వే శాఖ ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఈ ప్రమాదం రైల్వే లెవెల్ క్రాసింగ్ వద్ద కాపలాదారుడు లేకపోవడం వల్లనే ప్రమాదం చోటు చేసుకుంది. సైరన్ లేకుండా రైలు రావడం అది బస్సు డ్రైవర్ గమనించక పోవడమే ప్రమాదానికి కారణం అని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: