న్యాయవ్యవస్థపై సుప్రీంకోర్టు మాజీ జడ్జి మార్కండే కట్జు వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. అవినీతి, అక్రమాలకు న్యాయస్థానాలు నెలవయ్యాయని ఆరోపిస్తున్నారు. సుప్రీం కోర్టుగా జడ్జిగా చాలా ఏళ్లు పనిచేసి, ఆ తర్వాత మరో ప్రెస్ కౌన్సిల్ చైర్మన్ గా పని చేసినప్పుడు గుర్తుకు రాని అవినీతి ఇంత హటాత్ గా గుర్తుకు రావడం మరీ విడ్డూరం. మద్రాస్ హైకోర్టు అదనపు జడ్జి పదవీ కాలం పొడిగించడం వెనుక ముగ్గురు చీఫ్ జస్టిస్ ల ప్రమేయం ఉందని ఆరోపించారు. కట్జు మద్రాస్ హైకోర్టు చీఫ్ జస్టిస్ గానూ, తర్వాత సుప్రీం జడ్జిగాపని చేశారు. ఆ పదవుల్లో ఉన్నప్పుడు ఇలాంటి అక్రమాలు మార్కండే కు ఎందుకు గుర్తు రాలేదు. ఈ అక్రమాలు కన్పించినా పదవి పోతుందేమో నని భయపడ్డారా.. సుప్రీం జడ్జీలు భయపడితే... ఇక దిక్కేంటి... ఒకవేళ ఈ వయస్సులో అంతకన్నా ఎక్కువ పదవి ఏదైనా ఆశించి కట్జు ఈ ఆరోపణలు చేస్తున్నారా ...చూడాలి. అసలు కట్జు ఉద్దేశం ఏమిటో అర్థం కావాలి. పదవులు అనుభవిస్తున్నప్పుడు ఎలాంటి ఇబ్బందులు రాకుండాచూసుకోవడం, పదవీ విరమణ తర్వాత అవినీతి, అక్రమాలంటూ గగ్గోలు పెట్టడం మాజీ ఐపీస్ , ఐఏఎస్ అధికారులకు ఫ్యాషన్ అయిపోయింది. ఇప్పుడు ఆ జాబితాలో సుప్రీం మాజీ జడ్జీలు చేరుతున్నారా... అన్న సందేహం వస్తుంది... అవినీతి కన్పించినప్పుడు తాను ఏపదవిలో ఉన్నా వెంటనే స్పందించినప్పుడే... ప్రజలు ఆ ఆరోపణలను నమ్ముతారు. ఏమైనా మార్కండే కట్జు చేసిన ఆరోపణలను నిగ్గుతేల్చి... న్యాయవ్యవస్థ గౌరవాన్ని కాపాడాలి 

మరింత సమాచారం తెలుసుకోండి: