తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా సిటిజన్ కార్డులు ఇవ్వాలని ప్రతిపాదించింది. ప్రభుత్వ పధకాల లబ్దిదారులను ఎంపిక చేయడానికి గాను ఆగస్టు నెలలో సామాజిక స్థితిగతుల సర్వేను సర్వే చేయించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు నిర్ణయించారు. ఈ సర్వే వల్ల ఎవరు ఆయా పధకాలకు నిజమైన లబ్దిదారులన్నది తేలుతుందని కెసిఆర్ అబిప్రాయపడ్డారు. ఇళ్లు, రేషన్ కార్డులు, తదితర ప్రభుత్వ పధకాలలో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతున్న ఆరోపణలు వస్తున్న నేపధ్యంలో ఈ సర్వే ప్రజల సామాజిక , ఆర్ధిక స్థితిగతులను తెలుసుకోవడానికి ఉపయోగపడుతుందని, ఆ తర్వాత పాస్ పోర్టు తరహాలో తెలంగాణ సిటిజన్ కార్డులు ఇవ్వాలని, ఇవి బహుళ ప్రయోజనకార్డులుగా ఉంటాయని ఆయన అన్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఆధార్ కార్డులు ఇచ్చింది. మళ్లీ తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రయత్నం చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: