ఆంధ్రప్రదేశ్ లో ఏర్పడే కొత్త రాజధానికి విరాళాలు ఇచ్చే విషయంపై ఎన్‌జీవో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అశోక్‌బాబు గురువారం మీడియాతో మాట్లాడుతూ, కొత్త రాజధాని నిర్మాణం కోసం ముందుగా ఎన్జీవోలందరు ఒకరోజు వేతనాన్ని విరాళంగా ఇవ్వాలని అనుకున్నాం కానీ రాజధాని ఎక్కడ ఏర్పాటు చేస్తారనేదానిపై స్పష్టత లేన్నందున ఆ మొత్తాన్ని లోటు బడ్జెట్ ఉన్న పింఛన్లు, ఆరోగ్యశ్రీ తదితర పథకాలకువాడుతాం అని అంతేకాకుండా సమైక్యాంధ్ర ఉద్యమంలో చనిపోయినవారీ కుటుంబాలకు ఐదు లక్షల రూపాయల ఇస్తామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాల ప్రభుత్వ రంగ సంస్థలు విడిపోవడానికి మరో ఏడాది పడుతుందని అయన అన్నారు. అయితే ఈ సంస్థలలో పనిచేసే వారీకి కూడా ఉద్యోగులకు వయోపరిమితి 60 ఏళ్ల పొడిగింపును వర్తింప చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. అంతేకాకుండా ప్రస్తుతం రాష్ట్రం మొత్తం మీద పనిచేస్తున్న 80 వేల మంది కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసి, ఈ కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ విధానాన్ని పూర్తిగా రద్దుచేయాలనిఅశోక్ బాబు డిమాండ్ చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: