తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు గత పదేళ్లుగా ఎన్నో సమస్యలు ఎదుర్కున్నారని ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.అనంతపురం జిల్లా మీద తనకు ఎంతో అబిమానం ఉందని, అందుకే ఇక్కడ నుంచే రుణ మాఫీ పదకాన్ని ప్రకటించానని ఆయన అన్నారు. అనంతపురం జిల్లా పర్యటన సందర్భంగా ఆయన ప్రసంగించారు. అనంతపురం జిల్లాలో వర్షపాతం చాలా తక్కువగా ఉందని ఆయన అన్నారు. ఆనాడు సమైక్య రాష్ట్రంలో రుణమాఫీ ప్రకటించానని చంద్రబాబు చెప్పారు. ఆ తర్వాత రాష్ట్రం విడిపోయిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ కావాలని,టిడిపిని దెబ్బతీసి విభజనకు నాంది పలికిందని చంద్రబాబు విమర్శించారు. ఎవరినైనా రాజకీయంగా దెబ్బతీయాలనుకుంటే ప్రజలు ఎలా స్పందిస్తారో తెలుసుకోవడానికి ఇది ఉదహారణ అని అన్నారు.సుదీర్ఘ చరిత్ర కలిగిన కాంగ్రెస్ ను భూ స్థాపితం చేశారని,ప్రజలు అంతా ఒకే ఆలోచన చేశారని, దానివల్లే కాంగ్రెస్ ను తుడిచిపెట్టారని అన్నారు. అయితే ఇప్పుడు కోపం తగ్గిందని, ఎన్నికలు చూసిన తర్వాత ప్రజలలో చైతన్యం రావడం ,అన్యాయం పై కసి పెరిగి కసి తీర్చుకున్నారని అన్నారు.కాంగ్రెస్ పోయినా సమస్యలు ఉన్నాయని ఆయన తెలిపారు.ప్రజలకు సమస్యలు తెలియడానికే శ్వేతపత్రాలు విడుదల చేశానని అన్నారు. తనకంటే ఎవరూ ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా ఉన్నానని,అన్నీ తెలుసునని అన్నారు. రైతుల సమస్యలు, డ్వాక్రా మహిళల సమస్యలు తెలుసు కనుకే రుణమాఫీ చేశానని ాయన అన్నారు.దేశంలో ఇంత ఎక్కువ రుణమాఫీ ఎక్కడైనా జరిగిందా అని ఆయన ప్రశ్నించారు. లక్షాఏభై వేల రూపాయల మేర రుణ మాఫీ చేస్తామని ప్రకటించిన ఏకైక ప్రభుత్వం టిడిపి ప్రభుత్వం అని ఆయన అన్నారు. డ్వాక్రా సంఘాలకు ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఇచ్చామంటే అది తమ ఘనత అని ఆయన చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: