సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూసిన సీమాంధ్ర కాంగ్రెస్‌ నేతలు పార్టీని బలోపేతం చేసే దిశగా ప్రయత్నాలు మొదలు పెట్టారు. నేడు, రేపు విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేశారు. ఎన్నికల్లో ఓటమికి దారి తీసిన పరిస్థితులపై సమీక్షిస్తారు. రుణ మాపీపై కార్యాచరణ రూపొం దించాలని భావిస్తున్నారు. ఎన్నికల్లో టీడీపీ ఇచ్చిన వాగ్దానా న్ని పూర్తిగా అమలు చేయకుండా రైతు కుటుంబానికి లక్షన్నర, డ్వాక్రా గ్రూపులకు లక్ష రూపాయల వరకు రుణ మాఫీ చేస్తామని టీడీపీ ప్రభుత్వం ప్రకటించిందంటున్నారు. వీటికి సంబంధిం చిన పూర్తి స్థాయి విధి విధానాలు కూడా ప్రభుత్వం ప్రకటించ లేదని కాంగ్రెస్‌ నేతలు విమర్శిస్తున్నారు. అంతే కాకుండా రుణ మాఫీ ఎప్పటి నుంచి అమలు చేసేది కూడా ప్రకటించకుండా రైతులను ఆందోళనకు గురిచేస్తున్నారని ఆరోపిస్తున్నారు.  టీడీపీ విధించిన షరతుల కారణంగా దాదాపు 60 శాతం మేరకు రైతాంగానికి, డ్వాక్రా గ్రూపులకు రుణాల్లో కోత విధించారని విమర్శిస్తు న్నారు. ఎన్నికల్లో ప్రకటించి న విధంగా పూర్తిగా రైతులు రుణాలు, డ్వాక్రా రుణాలు మొత్తం మాఫీ చేయాలని డిమాండ్‌ చేస్తూ ఉద్యమాని కి శ్రీకారం చుట్టాలని నేతలు భావిస్తు న్నారు. ఉద్యమ కార్యాచరణను ఈ సమావే శాల్లోనే ఖరారు చేయాలని నేతలు భావిస్తున్నా రు. కాబట్టి ఈ సమీక్ష సమా వేశానికి ప్రాధా న్యత ఏర్పడిం ది. వైఎస్‌ ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఇప్పటికే సీమాంధ్రలో టీడీపీ ఎన్నిక ల్లో ఇచ్చిన వాగ్దాన్నాన్ని అమలు చేయకుండా మాట తప్పందని విమర్శిస్తూ మూడు రోజులుగా ఆందోళన సాగించింది. ఈ విషయంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ కంటే ముందు వరసలో ఉండాలని భావిస్తున్న కాంగ్రెస్‌ నేతలు కూడా ఆందోళనకు రంగం ప్రణాళికలు రచిస్తున్నారు.  టీడీపీ ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం అమలు చేసేంత వరకు కాంగ్రెస్‌ పార్టీ రైతులు, డ్వాక్రా మహిళా సంఘాల తరుపున తాము పోరాడతామని మాజీ పీసీసీ చీఫ్‌ బొత్స సత్యనారాయణ ఆంధ్రప్రభ ప్రతినిధితో శుక్రవారం అన్నారు. ఈ సమావేశానికి సీమాంధ్ర కాంగ్రెస్‌ ప్రముఖ నేతలు కేంద్ర మాజీ మంత్రులు పళ్లంరాజు, కిల్లి కృపారాణి, పనబాక లక్ష్మి, జేడీ శీలం, జాతీయ ఎస్సీ డిపార్ట్‌మెంట్‌ ఛైర్మన్‌ కొప్పుల రాజు, మాజీ మంత్రులు ఆనం రాంనారాయణరెడ్డి, దొక్క మాణిక్యవరప్రసాద్‌, కన్నా లక్ష్మీనారాయణ, మాజీమంత్రులు పసుపులేటి బాలరాజు, కొండ్రు మురళీ మోహన్‌, మాజీ ఎమ్మెల్యే ద్రోణంరాజు శ్రీనివాస్‌, మల్లాది విష్ణు పార్టీ ఉపాధ్యక్షుడు మాదాసు గంగాధర్‌, కార్యదర్శి, సుధాకర్‌బాబు తదితర నేతలు పాల్గొనున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: