ప్రస్తుతం కేసీఆర్ నిర్ణయాలు చూస్తుంటే, దొరల కోసం ప్రత్యేక దేశం ఇచ్చిందన్నట్లుగా ఉందని టిడిపి ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి అన్నారు. శుక్రవారం పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. నందగిరి హిల్స్ లో కానీ, నార్సింగ్ లో కానీ గంటల కొద్దీ గడపడానికి, రోజులకొద్దీ లావాదేవీలు జరపడానికి కేసీఆర్ కు సమయం ఉంది కానీ ఇఫ్తార్ విందుకు..మెదక్ లో జరిగిన సంఘటనను పరిశీలించడానికి ఆయనకు సమయం దొరకలేదా ? అని ప్రశ్నించారు. 1956 కంటే ముందు ఇక్కడ పుట్టిన వారు..ఇక్కడ ఉండేవారికి మాత్రమే ఫీజు రీయింబర్స్ మెంట్ వర్తిస్తుందని చెప్పడం జరిగిందని గుర్తు చేశారు. వారు నిరూపించుకోవడానికి ఏ రకమైన రికార్డులు ఇక్కడ వున్నాయి ? అని కేసీఆర్ ను ప్రశ్నించారు. ఆయనలాగా ప్రజల భూములు కొల్లగొట్టిన వారు వుండొచ్చు..లేకపోతే తప్పుడు ధృవపత్రాలతో స్థానికతను నిరూపించుకున్న వారు ఉండొచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారు. 1956 కంటే ముందునుంచి తెలంగాణ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలందరికి కూడా అత్తా పత్తా ఎక్కడి నుంచి వస్తుందని ఆయన ప్రశ్నించారు. దీనివెనుక కేసీఆర్ కుట్ర దాగివున్నదని విమర్శించారు. నిజంగా ఆయన తెలంగాణ ప్రాంత ప్రజలకు సహాయసహకారాలు అందించదలుచుకుంటే ఈ నిబంధనలు వర్తించవని అన్నారు. ఎంతో మంది తెలంగాణ బిడ్డలు వారి తండ్రులు, తాతలు, ముత్తాలు ఇక్కడే పుట్టి, పెరిగి, చనిపోయారని, వాటిని నిరూపించుకోవాలంటే, భూమిలేని దళితులకు, గిరిజనులకు, బడుగు బలహీన వర్గాలు ఏ విధంగా ధృవపత్రాలు తేగలరని ఆయన ప్రశ్నించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: