ఆంద్రప్రదేశ్ , తెలంగాణ ప్రభుత్వాల మద్య మరో రెండు అంశాలలో వివాదం ఏర్పడుతోంది. పోలవరం అధారిటీలో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని, పునరావాస కమిషనర్ ను నియమిస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించడంపై ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం అబ్యంతరం చెబుతోంది. ఇందులో తెలంగాణ ప్రభుత్వానికి సంబందం లేదని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు.ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలలోని గ్రామాలను ఆంధ్రప్రదేశ్ కు తరలించిన తర్వాత ఈ అంశంతో తెలంగాణకు సంబందం ఉండదని, వారి పునరావాసం , ఇతర అంశాలు అన్నీ ఎపి ప్రభుత్వం పరిదిలోకి వస్తాయని ఎపి వావిస్తోంది. మండలాలను ఎపిలో చేర్చకముందు పోలవరం అదారిటీలో తెలంగాణ ప్రభుత్వానికి ప్రాతినిధ్యం కల్పించాలని అనుకున్నారని,కాని ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నది ఎపి వాదన.కాని ఈలోగానే తెలంగాణ ప్రభుత్వం దీనిపై చొరవ తీసుకోవడం ఎపికి అభ్యంతరంగా ఉంది.దీనిపై కేంద్రానికి ఫిర్యాదు చేయాలని భావిస్తోంది.గవర్నర్ వద్ద కూడా ఈ పంచాయతీ జరగవచ్చు. అలాగే బూదాన బోర్డు ను తెలంగాణ ప్రభుత్వం ఏకపక్షంగా రద్దు చేసిందని ఎపి ప్రభుత్వం వ్యాఖ్యానిస్తోంది. భూదాన బోర్డుకు ఎపిలో కూడా భూములు ఉన్నాయని,అందువల్ల ఆ పైళ్లను ఎపి ప్రభుత్వానికి పంపవలసి ఉందని ఛీఫ్ సెక్రటరీ కృష్ణారావు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి స్పష్టం చేశారు.ఈ అంశంపై కూడా గవర్నర్ వద్ద కు వెళ్లాలని ఎపి ప్రభుత్వం భావిస్తోంది.మొత్తం మీద ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ఈ రెండు రాష్ట్రాలు వివాదాలలోకి దిగుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: