ఆంద్రజ్యోతి ప్రసారాల నిలుపుదలపై తాము జోక్యం చేసుకోలేమని హైకోర్టు తీర్పు ఇవ్వడం ఆ చానళ్లకు ఎదురు దెబ్బ తగిలినట్లయింది.కేబుల్ ఆపరేటర్లు చట్టబద్ద సంస్థ కాదని, రాష్ట్ర ప్రభుత్వం యంత్రాంగం పరిధిలోకి రాదని జడ్జి వ్యాఖ్యానించారు.అందువల్ల తాము ఈ కేసులో ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని, ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని హైకోర్టు పేర్కొంది. ఆంద్ర జ్యోతి చానల్ ఈ రిట్ దాఖలు చేసింది. హైకోర్టు కు ఇందులో పరిది లేకపోవచ్చు కాని, ఇందులో మంచి,చెడ్డలను విశ్లేషించి, దీనిపై తన అబిప్రాయం చెప్పి ఉంటే బాగుండేది.చానళ్ల ప్రసారం చేసిన విషయాలమీద కాని, అలాగే ఎమ్.ఎస్.ఓలు రెండు చానళ్ల ప్రసారాలు నిలిపివేసిన తీరును మొత్తంగా పరిశీలించి, హైకోర్టు సలహా ఇచ్చి ఉంటే భవిష్యత్తుకు మార్గదర్శకంగా ఉండేదేమో!

మరింత సమాచారం తెలుసుకోండి: