రైతులకు ఎన్నికల ముందు ఇచ్చిన రుణమాఫీని చేయడానికి 40 వేల కోట్ల రూపాయల అప్పును చేయబోతున్నామని... లాభాల్లో ఉన్న ప్రభుత్వ కంపెనీలను, ఇతర వనరులన తనఖా పెట్టి ఈ డబ్బును సేకరిస్తామని అంటోంది తెలుగుదేశం ప్రభుత్వం. ఈ విషయంలో స్పష్టమైన ప్రకటన చేయడంతో పాటు.. దీన్నొక ఘనతగా ప్రచారం చేసుకొంటోంది ప్రభుత్వం. ఇది ఎవరూ చేయలేని సాహసం అని.. తాము చేస్తున్నామని తెలుగుదేశం ప్రభుత్వం ప్రకటించుకొంటోంది! మరిప్రస్తుత సీమాంధ్ర ఆర్థిక స్థితిని చూసుకొంటే.. 40 వేల కోట్ల రూపాయలు అనేది గుదిబండ కాదు.. అంత పెద్ద బండ అని చెప్పవచ్చు! తెలుగుదేశం ప్రభుత్వం రుణమాఫీ కార్యక్రమాన్ని అమలు చేయడానికి ఈ అప్పు చేస్తున్నామని ప్రకటించుకొంది. అంటే.. ఎన్నికల ముందు పార్టీ పరంగా తాము ఇచ్చిన హామీని అమలు చేయడానికి ఈ డబ్బును వినియోగిస్తున్నట్టు ప్రకటించింది. అంటే.. తాము డబ్బు ప్రభుత్వానిది డబ్బా తెలుగుదేశం పార్టీది! ప్రభుత్వం 40 వేల కోట్ల రూపాయలు అప్పు చేయడానికి చాలా ఘనతగా చెబుతున్నారు. తెలుగుదేశం అనుకూల మీడియాలో కూడా దీన్నొక సాహస కార్యంగా చెబుతున్నారు. అయితే ఒకవైపు రైతులను రుణ విముక్తులు చేయడానికే అంటూ... తెలుగుదేశం వాళ్లు రాష్ట్రాన్ని రుణగ్రస్త సమాజంగా మారుస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ లో సగం మొత్తానికి సమానమయ్యేంత డబ్బును అప్పు చేస్తున్నారు. ఒకవేళ ఇదే పనిని ఏ కాంగ్రెస్ ప్రభుత్వమో, వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వమో చేసి ఉంటే.. తెలుగుదేశం పార్టీ ఇల్లు పీకి పందిరేసేది! రాష్ట్రాన్ని రుణ ఊబిలోకి లాగుతున్నారని తీవ్రంగా విమర్శించేది. తాము రాష్ట్రాన్ని బాగు చేస్తే.. ఇలాంటి అప్పులతో రాష్ట్రం నెత్తిన గుదిబండ వేస్తున్నారని విరుచుకుపడేది! అయితే తెలుగుదేశం వాళ్లు మాత్రం ఇప్పుడు దీన్ని సమర్ధించుకొంటున్నారు. సాహసంచేస్తున్నామంటున్నారు. మరి ఇది సాహసమో... లేక మొత్తానికే ముంచేసే ప్రయత్నమో విజ్ఞులైన ఆలోచన పరులే ఆలోచించాలి!

మరింత సమాచారం తెలుసుకోండి: