పుర్రికో బుద్ది అంటారు. నిజమే ఒక్కొక్కరి ఆలోచనలు ఒక్కొక్క విధంగా ఉంటాయి. అవి ఆమోదయోగ్యం కావచ్చు. కాకపోవచ్చు. అలాంటి వ్యవహారమే చైనాలో చోటు చేసుకుంది. మనం ఇప్పటి వరకు కప్‌ ఐస్‌క్రీమ్‌ చూసు కుంటాం... లేకా కోన్‌ ఐస్‌క్రీమ్‌ చూసివుంటాం. లేకుంటే బేసిక్‌ మోడల్‌ పుల్ల ఐస్‌ బాగా సుపరచితం. అయితే మన పొరుగున ఉన్న చైనా దేశంలోని ఐస్‌ క్రీమ్‌ తయారీ సంస్థ వినూత్నత కోసం ఒకడుగు ముందుకు వేసి చిక్కు ల్లో పడింది. కండోమ్‌ మాదిరి ఐస్‌ క్రీమ్‌లను మార్కెట్‌ లోకి విడుదల చేసి ప్రజల ఆగ్రహానికి గురయ్యింది. ఐస్‌ పాప్‌లుగా పిలుచుకునే వీటిని ఆ సఁస్థ బబుల్‌ క్రీమ్‌ పేరిట మార్కెట్‌లో ప్రవేశపెట్టింది. ఓ రబ్బరు తొడుగులో ఉండే ఈ ఐస్‌ క్రీమ్‌ను మూత తెరిచి తినాల్సి ఉంటుంది. ఈ ఉత్పత్తిపై ప్రజలు తీవ్రంగా స్పందించారు. పలుచోట్ల ఐస్‌ క్రీమ్‌ సంస్థకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దాంతో ఆ సంస్థ ఐస్‌క్రీమ్‌ తయారీపై సంజాయిషీ ఇచ్చుకోవాల్సి వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: