తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ భూములపైనే ఆశలు పెట్టుకున్నట్లు కనబడుతుంది. తెలంగాణ లో రుణమాఫీకి అవసరమైన మొత్తాలకు సంబందించి బడ్జెట్ లో నిర్దిష్టంగా కేటాయింపులు చేయాలని ఆ ప్రభుత్వం భావిస్తోంది.తద్వారా ప్రజలలోను, అటు రిజర్వు బ్యాంకుకు విశ్వాసం కల్పించాలన్న అబిప్రాయంతో ఉంనది చెబుతున్నారు . ఇటీవలికాలంలో హైదరాబాద్ చుట్టుపక్కల గాని,ఇతరత్రా కాని మూడు లక్షల ఎకరాల బూమి కబ్జా అయిందని అంచనాకు వచ్చిన తెలంగాణ ప్రభుత్వం వాటిలో కొంత స్వాధీనం చేసుకుని,దానిని విక్రయించడం ద్వారా వచ్చే మొత్తాన్ని బడ్జెట్ లో పెట్టడం ద్వారా రుణాల మాపీకి వినియోగించాలని యోచిస్తోందని కదనం.అలాగే రుణాల రీషెడ్యూల్ ను కోరిన సందర్భంలో రిజర్వు బ్యాంకుకు చట్టపరంగా చెల్లింపు హామీ ఇచ్చినట్లు అవుతుందని భావిస్తున్నారు.మొత్తం మీద హైదరాబాద్ లో భూములపై ఆశలు పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: