తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అనుకూల వాతావరణం ఏర్పడే సూచనలు కనిపించడం లేదు. టిఆర్ఎస్ బాబు పై చేస్తున్న అసత్య ప్రచరాన్ని తిప్పికొట్టడానికి ఆస్కారం లేకుండా పోయింది. బిజెపి బలం నామ మాత్రం. ఇటువంటి తరుణంలో ఏ విధంగా రాజకీయ భవిష్యత్తును కాపాడుకోవడం? అనే ప్రశ్నలు తెలంగాణ తెలుగుదేశం పార్టీలో చర్చనీయాంశమయ్యాయి. తెలుగు తమ్ముళందరూ ప్రత్యామ్నయ మార్గాల కోసం అన్వేషించడంలో నిమగ్నమయ్యారు. ఇప్పటికే కొంత మంది టిఆర్ఎస్ లోకి వెళ్ళాలని భావిస్తుఉండగా మరికొ్ంత మంది వేచి చూసే ధోరణి అనుసరిస్తున్నారు. అయితే చంద్రబాబు ప్రమేయం లేని వేదిక ద్వారా లేదా కొత్త రాజకీయ పార్టీ ద్వారా తాము ప్రజలలోకి వెడితే ప్రజలు ఆదరించే అవకాశం ఉందని మెజారిటీ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి కావడమే తన లక్ష్యం అని ప్రకటించుకున్న తెలుగుదేశం పార్టీ నేత ఏ రేవంత్ రెడ్డి లాంటి వారు అనేక రకాల ప్రత్యామ్నల గురించి తన మద్దతు దారులతో చర్చలు సాగిస్తున్నట్టు సమాచారం.    తెలంగాణలోని టిఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖర్ రావు నాయకత్వంలోని ప్రభుత్వం తెలంగాణ ముద్రతో కూడిన నిర్ణయాలు తీసుకుంటున్న నేపధ్యంలో వాటిని వ్యతిరేకించడం వల్ల తాము హైదరాబాద్ వెలుపల తీవ్రంగా నష్టపోతుండగా అయితే వాటిని సమర్ధిస్తే హైదరాబాద్ పరిసరర ప్రాంతాలలో రాజకీయ ఉనికి ప్రశ్నార్ధకరంగా మారే అవకాశం ఏర్పడిందిని తెలుగుదేశం నేతలు ప్రస్తుత పరిస్థితిని విశ్లేషిస్తున్నారు. ఇటువంటి తరుణంలో ఎటువంటి నిర్ణయం తీసుకున్న అది సాహసమె అవుతుందని వారు నిర్ణయం తీసుకోవడంలో తాత్సరం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పనితీరును మరికొన్ని రోజులు గమనించిన అనంతరం భవిష్యత్తుకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవాలని వారు భావిస్తున్నారు. ఇటువంటి ప్రయత్నాలను గమనించిన చంద్రబాబు నాయుడు తెలంగాణ నేతలను వదలకుండా ఉండాలని నిర్ణయించుకున్నారు. అందుకోసమే ఆయన తెలంగాణలో పార్టీని అభివృధ్ది చేయడం, పటిష్టం చేయడంపై దృష్టిని సారించారు. తెలంగాణ తెలుగుదేశం నేతలతో ప్రతి శనివారం సమావేశాలు నిర్వహించి అనేక కార్యక్రమాలు చేపట్టాలని ఆయన కృత నిశ్చయంతో ఉన్నారు. అయితే ఇప్పటికీ టిఆర్ఎస్ నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొంటున్న తెలంగాణలో భావోద్రేక రాజకీయాలను ఏ విధంగా ఎదుర్కొంటారో వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: