నెటిజన్లకు మరింత చేరువయ్యేందుకు సరికొత్త ఆప్షన్ ప్రవేశపెట్టింది ఫేస్ బుక్. ఇప్పటివరకూ మొబైల్ లో ఫేస్ బుక్ ను ఉపయోగించినా.. అందులో కావాల్సిన వాటిని సేవ్ చేసుకోలేదన్న చింతను తొలగించేందుకే ఈ సరికొత్త ఆప్షన్. మీరు ఆండ్రాయిడ్ లో లేదా ఐఓఎస్ స్మార్ట్‌ఫోన్లలో ఫేస్‌బుక్‌ ను ఉపయోగిస్తుంటే ఇక నుంచి ‘సేవ్’ అనే కొత్త ఆప్షన్ దర్శనమివ్వనుంది. సినిమాలు, పాటలు, టీవీ షోల వంటి వాటిని వీలు కుదిరినప్పుడు చూసుకునేందుకు వీలుగా వాటి లింకుల్ని ఈ ఆప్షన్ ద్వారా సేవ్ చేసుకోవచ్చు. మీరు సేవ్ జాబితాలో చేర్చుకునే లింకులు ఇతరులెవరికీ కనిపించవు కూడా. అవసరమనుకుంటే వాటిని ఆర్చీవ్ లో భద్రపర్చుకోవచ్చు. లేదా ఇతరులతో షేర్ చేసుకోవచ్చు.ఈ ఆప్షన్ ను అతి త్వరలోనే అందుబాటులోకి తెస్తున్నట్లు ఫేస్ బుక్ స్పష్టం చేసింది. యూజర్లు సేవ్ చేసుకున్న లింక్స్ ను ఏ సమయంలోనైనా తిరిగి చూసుకోవాలంటే ఎడమవైపున ఉన్న ట్యాబ్ ను క్లిక్ చేస్తే సరిపోతుందని తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: