అల్లర్లు యూపీని పరేషాన్ చేస్తున్నాయి. బీజేపీ, ఎస్పీ పాలిటిక్స్ రాజుకుంటున్నాయి. పరస్పర విమర్శలతో రెండు పార్టీలు.. మాటల యుద్ధం చేస్తున్నాయి. సహారన్ పూర్ అల్లర్లు.. రెండు పార్టీల మధ్య మరింత హీట్ పుట్టించింది. మరోవైపు సహారన్ పూర్ కాస్త చల్లబడింది. అలర్ల కేసులో 38 మందిని అరెస్టు చేశారు పోలీసులు. ఉత్తరప్రదేశ్ లో రాజకీయాలు హీటెక్కాయి. సమాజ్ వాదీ వర్సెస్ బీజేపీ వార్ నడుస్తోంది. ప్రతి ఇష్యూలో అఖిలేష్ సర్కార్ ను కమలనాథులు కార్నర్ చేస్తున్నారు. తాజాగా సహారన్ పూర్ అల్లర్ల విషయంలోనూ ఎస్పీని టార్గెట్ చేశారు. యూపీ లోక్ సభ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసిన బీజేపీ…సమాజ్ వాదీని మినట్ టు మినట్ కడిగి పారేస్తోంది. కొన్ని రోజులుగా యూపీలో అల్లర్లు వరుసగా జరుగుతున్నాయి. ముజాఫర్ నగర్ అల్లర్లతో మొదలై.. సహారన్ పుర్ జిల్లాకు పాకాయి. తాజా అల్లర్లపై కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ ..అఖిలేష్ సర్కార్ తో చర్చించారు. శాంతి భద్రతలు పరిరక్షించడంలో సమాజ్ వాదీ ప్రభుత్వం విఫలమైందని రాష్ట్ర బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. సహారన్ పుర్ లో పరిస్థితి కొద్దిగా మెరుగైంది. కొన్ని ప్రాంతాల్లో కర్ఫ్యూ కంటీన్యూ అవుతోంది. కనిపిస్తే కాల్చివేత ఆదేశాలిచ్చారు పోలీసులు. శాంతిభద్రతలు అదుపులోనే ఉన్నాయని కలెక్టర్ చెప్పారు. ఇప్పటివరకు 38 మందిని అరెస్టు చేసినట్టు చెప్పారు. రెండు వర్గాలపై 9 తొమ్మిది కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. అల్లర్లతో యూపీ హీటెక్కితే…ఇదే అదనుగా ఎస్ పీతో ఫైట్ చేస్తోంది బీజేపీ. రాజకీయంగా సమాజ్ వాదీనీ దెబ్బతీయాలని స్కెచ్ గీస్తున్నారు కమలనాథులు.

మరింత సమాచారం తెలుసుకోండి: