ఎమ్సెట్ కౌన్సిలింగ్ పై మన దారి మనం చూసుకుందామని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు వ్యాఖ్యానించారని సమాచారం. ఉన్నత విద్యామండలి నిర్ణయించిన విధంగా కౌన్సిలింగ్ తో తమకు సంబంధం లేదని, తెలంగాణ విద్యార్ధులు ఆందోళన చెందనవసరం లేదని కెసిఆర్ స్పష్టం చేస్తున్నారు. మహారాష్ట్ర,కర్నాటకల మాదిరి ఆంద్ర ప్రదేశ్ కూడా తన కౌన్సిలింగ్ ను తాను ప్రకటించుకుందని భావించాలని ఆయన అబిప్రాయపడుతున్నారు.ఇదే విషయాన్ని మంత్రి జగదీష్ రెడ్డి చెబుతూ వాళ్ల కౌన్సిలింగ్ వాళ్లు చేసుకుంటే, మన కౌన్సిలింగ్ మనం చేసుకుందాం అని వ్యాఖ్యానించారు. పక్కా ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన చెప్పారు.మొత్తం మీద తెలంగాణ ప్రభుత్వం సొంతంగా కౌన్సిలింగ్ చేసుకునే యోచనలోనే ఉందని అనుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: