గాజా దాడులకు ప్రతీకారంగా ముంబై నగరంపై దాడులు చేస్తామంటూ నగర పోలీస్ కమిషనర్ రాకేష్ మారియాకు బెదిరింపు లేఖ వచ్చింది. దాంతో ముంబై నగరంలో హై అలెర్ట్ ప్రకటించారు. ముజాహిద్దీన్ పేరిట ఉన్న ఆ లేఖలో చేతనైతే తమను ఆపాలంటూ సవాల్ విసిరారు. దాంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. క్రైమ్ బ్రాంచ్ సహా ముంబై నగరంలోని అన్ని పోలీస్ బ్రాంచ్‌లకు ఈ లేఖ గురించి సమాచారం అందించారు. మరోవైపు ఆ లేఖ రాసిందెవరో కనుగొనడానికి ముంబై పోలీసులు ప్రయత్నిస్తున్నారు. రానున్నది పర్వదినాల సీజన్ కావడంతో రాష్ట్రంలోని పోలీసులు అప్రమత్తంగా ఉండాలని ముంబై పోలీస్ కమిషనర్ రాకేష్ మారియా పోలీస్ విభాగంలోని అన్ని శాఖలకు ఇంటర్నల్ సర్క్యూలర్లు జారీ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: