మురళీమోహన్.. టీడీపీలో చాలాకాలం నుంచి పనిచేస్తున్న ఈ సీనియర్ నటుడు ఎట్టకేలకు మొన్నటి ఎన్నికల్లో గెలిచారు. ఎంపీ అయ్యారు. సహజంగా వివాదాలకు దూరంగా ఉండే ఆయన లేటెస్ట్ గా వివాదానికి తెర తీశారు. అదే.. కోస్తాతీరంలోని గ్యాస్ నిల్వల సంగతి.. ఆంధ్రప్రదేశ్ లో ఉత్పత్తి అవుతున్న గ్యాస్ ను ఇతర రాష్ట్రాలకు తరలించడం సరికాదన్నారు. అలా చేయడం వల్ల ఏపీలోని విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు, ఇతర పరిశ్రమలకు ఆటంకం కలుగుతుందన్నారు. తూ.గో. జిల్లా నుంచి గ్యాస్ గుజరాత్, మహారాష్ట్రలకు తరలించుకుపోవడం వల్ల జిల్లా అభివృద్ది కుంటుపడుతుందన్నారు. మురళీ మోహన్ ఈ వ్యాఖ్యలు తెలిసి అన్నారో.. తెలియక అన్నారో.. తెలియదు కానీ.. ఇప్పుడు గ్యాస్ గుజరాత్, మహారాష్ట్రలకు తరళివెళ్తోందంటే.. అందుకు చంద్రబాబుగారి గత పాలనే కారణమంటారు విమర్శకులు. ఆయన పాలనలోనే.. ఈ గ్యాస్ ప్రాజెక్టులకు కేంద్రం బిడ్లు ప్రకటించిందని.. అప్పుడు వాటిలో ఏపీ పాల్గొనలేదని.. గుజరాత్, మహారాష్ట్రలతో పాటు రిలయన్స్ వంటి సంస్థలు పోటీలో పాల్గొని.. వాటికి దక్కించుకున్నాయి. ఆనాడు చంద్రబాబు కాస్త ముందు చూపుతో వ్యవహరించి ఉంటే.. ఇప్పుడు కొత్త రాష్ట్ర అభివృద్దికి తూ.గో గ్యాస్ బ్రహ్మాండంగా ఉపయోగపడి ఉండేదని అనేవారు లేకపోలేదు. ఏదేమైనా గతం గతః . గ్యాస్ మనదే అయినా.. గ్యాస్ కోసం మనమే బిచ్చమెత్తాల్సిన ఈ పరిస్థితిని తప్పించే దిశగా అడుగులు వేయాలి. ఓ ఎంపీగా ఆయన ఆవేదన.. మాట్లాడిన తీరు మెచ్చుకోదగిందే.. కానీ ఆ ఆవేదన మాటలకే పరిమితం కాకూడదు. గ్యాస్ ఆంధ్ర అభివృద్ధి ఉపయోగించే దిశగా చర్యలు చేపట్టాలి. కేంద్రం దగ్గర మనకు భలే పలుకుబడి ఉందని జబ్బలు చరుకునే తెలుగుదేశం నాయకులు.. మరి ఆ పలుకుబడి ఉపయోగించి.. గ్యాస్ మనకు దక్కేటట్టు చర్యలు తీసుకుంటే.. అంతకు మించి కాలసింది ఏముంది. ఏదేమైనా మురళీమోహన్ వ్యాఖ్యలతో మరోసారి గ్యాస్ నిల్వల గురించి చర్చ జరగడం ఖాయం.

మరింత సమాచారం తెలుసుకోండి: