సానియామీర్జా వ్యవహారంలో తమ పార్టీ నేత లక్ష్మణ్ పై అందరూ విరుచుకుపడటాన్ని ఖండించాడు బీజేపీ తెలంగాణ విభాగం అధ్యక్షుడు కిషన్ రెడ్డి. సానియా ను తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ గా నియమించడంపై బీజేపీ వాళ్లు అభ్యంతరం సంగతి తెలిసిందే. పాకిస్తానీ కోడలు అయిన సానియాను తెలంగాణ అంబాసిడర్ గా ఎలా నియమిస్తారు? అంటూ బీజేపీ నేత లక్ష్మణ్ వ్యాఖ్యానించాడు. అయితే ఈ వాయిస్ పై బీజేపీలోనే అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. బీజేపీ తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జి అయిన ప్రకాశ్ జావదేకర్ సానియా భారతదేశానికే గర్వకారణం అని వ్యాఖ్యానించాడు. ఇక ఇదే సమయంలో సానియా కూడా టీవీ చానల్ కు చేరి ఏడ్చడంతో ఆమెపై సానుభూతి వెళ్లువెత్తింది. అందరూ లక్ష్మణ్ పై విరుచుకుపడ్డారు. ఈ అంశంలో తమ పార్టీ నేతను రక్షించే పనిలో పడ్డాడు కిషన్ రెడ్డి. లక్ష్మణ్ ఒక్కమాట అన్నందుకే అందరూ ఆయనను తప్పుపడుతున్నారని.. ఇదే సమయంలో టీఆర్ఎస్ ఎంపీ కవిత కాశ్మీర్ అంశం గురించి అర్థం లేకుండా మాట్లాడిన విషయాన్ని కిషన్ రెడ్డి గుర్తు చేస్తున్నాడు. కాశ్మీర్ ను భారతదేశం ఆక్రమించుకొంది.. కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం కాదు.. అని కవిత వ్యాఖ్యానించింది . లక్ష్మణ్ మాట్లాడిన మాటలతో పోలిస్తే కవిత వ్యాఖ్యానాలు తీవ్రమైనవి... దారుణమైనవి. దేశ సమగ్రత ను దెబ్బతీసేలా మాట్లాడింది ఆమె. అయినప్పటికీ ఆమెను ఒక్క మాట అన్న నాథుడు లేడు. దేశద్రోహం కేసు పెట్టదగ్గ స్థాయిలో ఉన్నాయి కవిత వ్యాఖ్యానాలు. అయితే కవిత మాత్రం సేఫ్ జోన్ లోనే ఉంది... అని కిషన్ రెడ్డి బాధపడుతున్నాడు. మరి ఆయన లాజిక్ కరెక్ట్ గానే ఉంది.. కానీ, కవిత లక్ అలా ఉంది మరి!

మరింత సమాచారం తెలుసుకోండి: