బీజేపీ ఎంపీలకు అడుగడుగునా పరీక్షలే. పార్లమెంటు జరిగే రోజుల్లో బీజేపీ ఎంపీల పెర్ ఫామెన్స్ ను ఓ కంట కనిపెడతారు. వాళ్ళు పార్లమెంటుకు టంచనుగా వస్తున్నారో లేదో చూడడం దగ్గరనుంచి సభలో ఏమన్నా మాట్లాడుతున్నారా, లేదా? అనే విషయం వరకు అన్నీ గమనిస్తూ ఉంటారు. మాట్లాడితే, ఏం మాట్లాడారన్నది చూస్తారు. అంతే కాదు, దీనికోసం ఎంపీలకు కొన్ని ఫారాలు ఇచ్చి నింపమంటారు. అలా అన్నీ కలగలిపి….ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ కార్డు తయారుచేస్తారు. లోక్ సభలో, రాజ్యసభలో కలిసి బీజేపీకి 320 మంది వరకు ఎంపీలున్నారు. ఇప్పుడు వీళ్ళందరికీ మంత్లీ టెస్ట్ పెట్టారన్నమాట. టెస్టు ఆలోచన ఎవరిదో వేరే చెప్పాల్నా? ప్రధాని నరేంద్ర మోడీ కాకుండా మరెవరన్నా ఇలాంటి ఆలోచన చేయగలరా? మోడీ చెప్పినమీదట్నే బీజేపీ పార్లమెంటు మెంబర్లకు ఈ ప్రోగ్రెస్ రిపోర్టుల ఆలోచన అమలుచేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: