ఆంధ్రప్రదేశ్ రైతులకు ఐ ప్యాడ్ లు పంపిణీ చేస్తామని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించాడు! రైతులకు వ్యవసాయ సంబంధ సలహాలు, సూచనలు అందించడానికి వీటిని అందజేస్తామని ఆయన ప్రకటించాడు. మరి మన రైతుల్లో ఎంతమందికి ఐ ప్యాడ్ లు వినియోగించడం వచ్చు.. అసలు ఐ ప్యాడ్ ల ద్వారా ఎలాంటి వ్యవసాయ సలహాలు, సూచనలు అందించవచ్చు? అనే అంశాల సంగతి పక్కన పెడితే.. ఇప్పుడు తెలుగు తమ్ముళ్లు మాత్రం భలే అనందపడిపోతున్నారు! రైతులకు ఐ ప్యాడ్ లు అంటే.. అవి తమకు గాక మరెవరికి చెందుతాయి? అనేది వాళ్ల లెక్క! తాము రైతులం కామా? తమ కన్నా రైతులు ఎక్కడున్నారు? అని అంటున్నాయి పచ్చ చొక్కాలు అప్పుడే! తెలుగుదేశం పార్టీ ని గెలిపించడానికి తామెంత శ్రమపడ్డాము? ఆ శ్రమకు ఇప్పుడు రుణం తీర్చుకోవాలిగా.. పార్టీ పరంగా చేయడం సంగతి ఎలా ఉన్నా.. ప్రభుత్వ పరంగా మాత్రం దక్కాల్సినవి దక్కాలి... అంటూ వారు వాదిస్తున్నారు. తమ నేత చంద్రబాబు నాయుడు రైతులకు ఐ ప్యాడ్ లు ప్రకటించాడు.. వాటిని అందుకొనే అర్హత తమకేనని వారు అంటున్నారు. ప్రతి ప్రభుత్వంలోనూ ఇది జరిగేదే.. ప్రభుత్వాలు ప్రవేశపెట్టే ప్రత్యేక పథకాలు, ప్రత్యేక సదుపాయాలు ప్రధానంగా అధికార పార్టీ చెంచాలకే దక్కుతాయి. వాళ్లే వాటిని స్వాదీనం చేసుకొంటారు. తమ పరపతిని ఉపయోగించుకొని.. వాటిని పొందుతారు. ఎలాగూ ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి రైతుకూ ఐ ప్యాడ్ లు అందించడం సాధ్యమయ్యే విషయం కాదు. ఎంపిక చేసిన రైతులకు మాత్రమే వాటిని అందిస్తారు. ఊరికి ఒకటీ రెండు అందుతాయి. అవి పైరవీలు చేసుకొని తెలుగుదేశం అనుకూలురులు సొంతం చేసుకొంటారు. గతంలోనూ ఇలాంటివి జరిగాయి.. అయితే ఈ సారి ఏకంగా ఐ ప్యాడ్ లేనట! ఒక్క దెబ్బతో తెలుగు తమ్ముళ్లకు స్మార్ట్ డివైజ్ ల కొరత తీరుతుందనడంలో సందేహం లేదు!

మరింత సమాచారం తెలుసుకోండి: