తెలంగాణ ప్రభుత్వం రుణమాఫీపై రిజర్వు బ్యాంకుతో చర్చలు జరుపుతోంది.రుణమాఫీ కి సంబందించిన డబ్బును వాయిదాల పద్దతిన ఐదుసార్లుగా చెల్లించేందుకు అనుమతి ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం కోరగా రిజర్వు బ్యాంకు అందుకు సుముఖత చూపలేదని చెబుతున్నారు. ఏకమొత్తంగానే మాఫీ మొత్తం చెల్లించాలని చెబుతున్నట్లు కధనం. దీనిపై తెలంగాణ ప్రభుత్వానికి, ఆర్బిఐకి మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. అయితే రిజర్వు బ్యాంకు కనుక ఏక మొత్తంగా మాఫీకి అయ్యే సొమ్మును చెల్లించాలని పట్టుబడితే రాష్ట్ర ప్రభుత్వాలు కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది.తెలంగాణలో సుమారు ఇరవైవేల కోట్లు, ఆంద్రలో లక్షన్నర చొప్పున లెక్క వేస్తే సుమారు నలభై వేల కోట్ల రూపాయలు మాఫీ చేయవలసి ఉంటుంది.అంత మొత్తాలు రాష్ట్రాలు ఒకేసారి చెల్లించగలుగుతాయా అన్నది ప్రశ్నార్ధకమే!

మరింత సమాచారం తెలుసుకోండి: