కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరం, ఆయన కొడుకు క్రాంతి పై సీబీఐ దృష్టి సారించింది. 2006లో ఎయిర్ సెల్ – మాక్సిస్ ఒప్పందానికి ఎఫ్ ఐపీబీ ఆమోదం తెలిపే విషయంలో అప్పటి ఆర్థికమంత్రి పి. చిదంబరం, ఆయన కొడుకు క్రాంతి ల పాత్ర, జరిగిన అక్రమాలపై సీబీఐ దర్యాప్తు జరుపుతుంది. క్రాంతితో సంబంధం ఉన్నకంపెనీ -ఎయిర్ సెల్ మధ్య జరిగిన బ్యాంకింగ్ లావాదేవీలు, ఎఫ్ఐపీబీ ఆమోదించిన సమయంలో జరిగిన వ్యవహారాలపై ఎప్పుడో ఒకప్పుడు తండ్రీ కొడుకులను సీబీఐ బోనులో నిలబెట్టే అవకాశం ఉంది. ఎయిర్ సెల్ – మాక్సిస్ ఒప్పందం విషయంలో మాజీ టెలికాం మంత్రి దయానిధి మారన్, అతడి సోదరుడు కళానిధి మారన్ –లను ప్రాసిక్యూట్ చేసేందుకు అవసరమైన సాక్ష్యాధారాలున్నట్లు తెలుపుతూ అటార్నీ జనరల్ ముకుల్ రోహ్‌—గీ సీబీఐకి లీగల్ ఒపీనియన్ అందజేశారు.దాంతో ఈ కేసు వెలుగులోకి వచ్చింది. ఎయిర్ సెల్ యజమాని శివశంకరన్, కంపెనీలో ఉన్నతన అన్ని షేర్లను మలేషియా బిజినెస్ మన్ టి. ఆనంద కృష్ణన్ కు చెందిన మాక్సిస్ కు అమ్మేయాలని దయానిధి మారన్ వత్తిడి తెచ్చాడని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ ఉపకారానికి ప్రతిఫలంగా మలేషియా కంపెనీ మాక్సిస్ - మారన్ బ్రదర్శ్ ఆధ్వర్యంలోని సన్ టీవీ నెట్- వర్క్- లో రూ. 650 కోట్లు పెట్టుబడి పెట్టింది. అప్పట్లో ఆర్థికమంత్రి పి. చిదంబరం ఆధ్వర్యంలో ఉన్న విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (ఎఫ్ ఐపీబీ) 2006లో మొత్తం ఒప్పందానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఇందుకోసం చిదంబరం నిబంధనలకు నీళ్లొదిలారన్నది ప్రధాన ఆరోపణ. ఆ క్లియరన్స్ వ్యవహారంపై సీబీఐ దృష్టి పెట్టింది.  ఇక చిదంబరం కొడుకుకు 94శాతం షేర్లు ఉన్న కంపెనీ - అస్ బ్రిడ్జ్ హోల్డింగ్స్. ఆసంస్థకు మెజారిటీ షేర్లు ఉన్న మరో సంస్థ అడ్వాటేజ్ స్ట్రాటజిక్ కన్సల్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఎయిర్ సెల్ కు 26 లక్షలమేరకు రుణాలు , అడ్వాస్ లను బదిలీ చేసింది. ఈ వ్యవహారంపైనా సీబీఐ దృష్టి పెట్టింది. ఇప్పుడు తండ్రీ కొడుకులే.. సీబీఐ దృష్టిలో ఉన్నారు. బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి ఈ మధ్య సుప్రీంకోర్టులో ఓ పిల్ దాఖలు చేశారు. చిదంబరం కొడుకు క్రాంతి వ్యవహారాలు, అతడికి చెందిన కంపెనీ శివశంకరన్ కు చెందిన ఎయిర్ సెల్ టెలివెంచర్ లో ఐదు శాతం షేర్లు కొంటూ 26 లక్షలు చెల్లించిన వ్యవహారంపై పిల్ దాఖలు చేసారు. సీబీఐ విచారణను కోరారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: