సినీ పరిశ్ర మకు చేదోడు వాదోడుగా ఉండ డంతోపాటు స్థానికులకు ఉపాధి అవకాశాలు దొరికేవిధం గా తెలంగాణలో రెండు వేల ఎకరాల్లో సినిమా సిటీ నిర్మించా లని సీఎం కే. చంద్రశేఖరరావు స్పష్టం చేశారు. సినిమా పరిశ్రమను హైదరా బాద్‌ నుండి ఎట్టి పరిస్థితు ల్లో తరలిపోనివ్వ మని, హైదరాబాద్‌ లాంటి మంచి వాతా వరణం ఉన్న నగరం ఎక్కడా దొరకద న్నారు. సినిమా షూటింగ్‌లు, టీవీ సీరియళ్ళ నిర్మాణం హైదరాబాద్‌లోనే ఎక్కువగా జరు గుతోందని, అందుకు అనుగుణంగా సినిమా సిటీ నిర్మిస్తామన్నారు. గ్రాఫిక్స్‌, ఎఫెక్ట్స్‌ లాంటి సాంకేతిక అంశాలకు సంబంధించిన స్టూడి యోలు కూడా సినిమా సిటీలో ఉంటాయన్నా రు. తెలంగాణ ప్రాంతంలో ఉన్న అపారమైన ఖనిజ నిక్షేపాలను వెలికితీసి పరిశ్రమలు నెలకొ ల్పాలని ఆయన అధికారులను ఆదేశించారు. తెలంగాణ మినరల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. తెలంగాణలోని సహజ వనరు లు, మానవ వనరులను పూర్తిస్థాయిలో ఉపయోగిం చుకు నేవిధంగా పారిశ్రామిక విధానం ఉండాలన్నారు. గురువారం పారిశ్రామిక విధానంపై ఆయన సమీక్ష నిర్వహించారు. తెలంగాణ జిల్లాల్లో ఒక్కో జిల్లాలో ఒక్కో ఖనిజ సంపద ఉందని, సమైక్య రాష్ట్రంలో వీటిపై నిర్లక్ష్యం చేయడం వల్లే తెలంగాణలో పరిశ్రమలు ఏర్పాటు కాలేదన్నారు. వరంగల్‌, ఖమ్మం సరిహద్దు లో లక్షా 50 వేల ఎకరాల్లో అపార ఖనిజ సంపద ఉంటే అది పనికి రానిదని సీమాంధ్ర పాలకులు దుష్ప్రచారం చేశారని, అయితే ఇటీవలే స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా రూ.30 వేల కోట్ల వ్యయంతో స్టీల్‌ ఫ్యాక్టరీని పెట్టేందుకు ముందుకు వచ్చిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. బయ్యారం ఖనిజం చాలా ఉపయుక్తమని పరిశీల నలో వెల్లడైందని అన్నారు. ఇంకా తెలంగాణలో చాలా సహజ వనరులు ఉన్నాయని, లైఫ్‌ సైన్సెస్‌, ఐటీ, హార్డ్‌వేర్‌, ఫుడ్‌ ప్రాసెసింగ్‌, డిఫెన్స్‌, కాటన్‌, స్పిన్నింగ్‌, లెదర్‌, మైన్స్‌, మినరల్స్‌, వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌, ప్లాస్టిక్‌, పాలిమర్‌, కెమికల్‌, జేమ్స్‌, పెరల్స్‌, జువ్వెల్లరీ, ఆటో మొబైల్స్‌ తదితర రంగాల్లో పరిశ్రమల ఏర్పాటుకు గల అవకాశాలను పరిశీలించాలని సీఎం ఆదేశించారు. తెలంగాణలో సింగిల్‌ విండో ఛేజింగ్‌ సెల్‌తో కూడిన పారిశ్రామిక విధానం ప్రతి రంగానికి సంబంధించిన పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు వీలుంటుందని అన్నారు. పారిశ్రామిక రంగానికి సంబంధించి ప్రస్తు తం ఉన్న చట్టాలు, విధానాలపై క్షుణ్ణంగా సమీక్షించి మార్పులు, చేర్పులు చేయాలని, అవసరమనుకుంటే పాత చట్టాలను పూర్తిగా తొలగించి కొత్త చట్టాలను రూపొందించాలని సీఎం కేసీఆర్‌ చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: