కాంగ్రెస్ పార్టీ ఓటమికి ప్రధాన కారణం పార్టీ సమర్ధవంతమైన నాయకత్వం లేకపోవడమే అని గద్వాల్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి డి. అరుణ అన్నారు. నాయకత్వ లోపం కాంగ్రెస్ పార్టీలో స్పష్టంగా కనిపిస్తుందన్నారు. ముఖ్యమంత్రి పదవికి సీనియర్ లీడర్ ను కనుక ఫోకస్ చేసి ఉంటే.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఉండేదేమో అని ఆమె తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కలహాలు, కుమ్ములాటల వలన ప్రతిపక్షాలు లాభపడ్డాయి. ఇకనైనా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం మాని, కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేయాలని ఆమె నాయకులకు హితవు పలికారు.  తెలంగాణ లో ఏర్పాటైన టీ ఆర్ ఎస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. టీ ఆర్ ఎస్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి రెండు నెలలు కావోస్తున్నా ఇంతవరకు ఒక్క హామీని కూడా నేరవేర్చలేకపోయారని ఆమె మండిపడ్డారు. రుణమాఫీపై పభుత్వం స్పష్టత ఇవ్వలేదని, విద్యార్ధుల భవిష్యత్తుతో అడుకోవద్దని ఆమె ప్రభుత్వాన్ని కోరారు. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పర కలహాలు మాని అభివృద్దిపై దృష్టి పెట్టాలని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: