కొద్ది రోజులుగా కొనసాగుతున్న సస్పెన్స్ కు తెరవీడనుంది. లోక్ సభలో ప్రధాన ప్రతిపక్షం ఉంటుందా లేదా అనేది మరో నాలుగైదు రోజుల్లో తేలనుంది. ఇప్పటికే ఏజీ సలహా తీసుకున్న స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రధాన ప్రతిపక్ష హోదా అంశంపై నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమయ్యారు. లోక్ సభలో ప్రధాన పతిపక్షం ఉంటుందా లేదా అనే అంశంపై కొద్ది రోజలుగా సస్పెన్స్ కొనసాగుతోంది. ప్రధాన విపక్షం హోదాకు సరిపడా ఎంపీ సీట్లు ఏ పార్టీకి రాకపోవడంతో ఈ సస్పెన్స్ కు తెరవీడటం లేదు. దీనికి కావాల్సిన కనీస సీట్లు ఏ పార్టీకి రాకపోయినప్పటికీ ఎక్కువ సీట్లు వచ్చిన తమకే ప్రధాన ప్రతిపక్ష హోదాను కల్పించాలని లోక్ సభలో స్వయంగా యూపీఏ ఛైర్ పర్సన్ సోనియాగాంధీ స్పీకర్ ను కోరింది. అయినా ఈ వ్యవహారంపై స్పీకర్ ఇన్ని రోజులు ఏ నిర్ణయం తీసుకోలేకపోయింది.  ఇక ఇన్ని రోజులు సస్పెన్స్ గా ఉన్న ఈ వ్యవహారాన్ని తేల్చేందుకు సిద్ధమయ్యారు లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్. ఇప్పటికే దీనిపై అటర్నీ జనరల్ సలహా కోరిన ఆమె మరో నాలుగైదు రోజుల్లో నిర్ణయం తీసుకోనున్నారు. ఈ విషయంలో తన విచక్షన అధికారాలు ఏమీ లేవని నిబంధనల మేరకే నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. గతంలోనూ ప్రతిపక్ష నేతలు లేని సందర్భాలున్నాయని గుర్తు చేస్తూ.....1980,1984లో పదోవంతు స్థానాలు ఎవరికి రాకపోవడంతో ప్రతిపక్ష స్థానాన్ని ఎవరికి కేటాయించలేదని గుర్తు చేశారు ఇప్పటికే ఏజీ రోహత్గీ కాంగ్రెస్ కు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలన్న డిమాండ్ ను కొట్టిపారేశారు. ప్రతిపక్ష మోదా పొందేందుకు కాంగ్రెస్ కు అర్హత లేదన్నారు. బీజేపీ నేతలు కూడా ఇదే మాట చెబతున్నారు. ఈ నేపథ్యంలో స్పీకర్ ప్రకటించబోయే నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: