ఏమైందో కానీ ఈ మధ్య కాలంలో వైపరీత్యాలు ఎక్కువయ్యాయి. ప్రకృతి వైపరీత్యాలు ఒకవైపు ప్రమాదాలు మరోవైపు.. ఒకదాని తర్వా త మరోటిగా జరుగుతున్న పరిణామాలు అనేకమందిని బాధితులుగా మారుస్తున్నాయి. మరి ఇలాంటి బాధితుల విషయంలో కూడా పెద్ద రాజకీయాలే జరుగుతున్నాయని స్పష్టంగా అర్థమవుతోందిప్పుడు. తాజాగా బియాస్ నదీ ప్రవాహంలో కొట్టుకుపోయిన స్టూడెంట్స్ పరిహారం విషయంలో వస్తున్న వార్తలు విస్మయ కరంగా ఉన్నాయి. బియాస్ నదీ ప్రవాహంలో కొట్టుకుపోయిన విద్యార్థుల్లో ఆంధ్ర వాళ్లున్నారు, తెలంగాణ వాళ్లున్నారు. వాళ్ల కు అప్పట్లో ఘనంగా పరిహారం ప్రకటించిన ప్రభుత్వాలు ఇప్పుడు.. దాన్ని ఇవ్వడంలో వ్యవహరిస్తున్న తీరు మాత్రం విమర్శలకు దారి తీస్తోంది. బియాస్ ప్రమాద బాధితులకు ఆంధ్ర, తెలంగాణ ప్రభుత్వాలు పోటీలు పడి మరీ పరిహారాలు ప్రకటించాయి. విద్యార్థులంతా హైదరాబాద్ లో చదువుకొంటున్న వారన్నట్టుగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన పరిహారం చెల్లించింది. అయితే ఏపీ ప్రభుత్వం మాత్రం ఈ విషయంలో మీనమేషాలు లెక్కిస్తోంది. లక్ష, లక్షన్నర పరిహారాన్నిచెల్లించడంలో లెక్కలు వేసుకొంటూ.. బాధితులకు కొత్త టెన్షన్ పెడుతోంది. విద్యార్థుల తల్లిదండ్రులు ఈ విషయంలో మీడియా ముందుకు వచ్చారు. మరి ఇదంతా సరైన వ్యవహారం కాదని చెప్పవచ్చు! జరిగిన ప్రమాద తీవ్రతను బట్టి చెలరేగాల్సిన వివాదం కాదు! మరి వీలైనంత త్వరగా ఈ వ్యవహారాన్ని సద్దుమణిగేలా చేస్తే మంచిది. ప్రమాదాలు, పరిహారాలతో రాజకీయాలు అంత మంచిది కాదు కదా!

మరింత సమాచారం తెలుసుకోండి: